వార్త‌లు

ప‌వ‌న్ పోరాడుతుంటే.. ఏపీ బీజేపీ ఎందుకు అలా మౌనంగా ఉంది..?

ఎన్నికల్లో హిందుత్వ సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టాలని కొన్ని పార్టీలు.. ఇంకొందరు నేతలు హిందుత్వ సెంటిమెంట్‌ను నెత్తికెత్తుకుంటుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా బీజేపీ పార్టీ హిందూ మ‌తంపై పేటెంట్ హ‌క్కులు తీసుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంది. అయితే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో మొదలైన లొల్లి.. హిందూ ఎజెండాను చాటిచెప్పుకునే దిశగా వెళుతున్న‌ట్టుగా క‌నిపిస్తుండగా, ఇందులో ఏపీ బీజేపీ ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ అయితే హిందూత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ తనకు తాను చాంపియన్‌గా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

సనాతన ధర్మ రక్షణ జరగాలని… అందుకోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌… హిందూత్వంపై తనతో పోటీ పడలేరన్నట్లు దూసుకుపోతున్నట్లు చెబుతున్నారు. విమర్శలు, వ్యాఖ్యలతోనే ఆగకుండా పాప ప్రక్షాళన జరగాలని ఏకంగా ప్రాయశ్చిత్య దీక్ష చేయడమూ ఓ వర్గాన్ని హత్తుకున్నట్లైందని అంటున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన నాయ‌కుడిగా క‌న్నా బీజేపీ నాయ‌కుడిగానే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతున్నారు. తిరుమలలో జరిగిన ఈ అపచారానికి బాధపడి ఇవన్నీ చేస్తున్నారా లేక బీజేపీ ఫార్ములాని అమలుచేస్తున్నారా?అనే ప్రకాష్ రాజ్ ప్రశ్న కూడా ఆలోచింపజేస్తుంది.పవన్‌ కళ్యాణ్‌ హిందూ పరిరక్షణ గురించి గట్టిగా మాట్లాడుతూ, ఈవిదంగా హడావుడి చేస్తుంటే ఏపీ బీజేపీ నేతలందరూ అసలు తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం గురించి తెలియన్నట్లు సైలెంట్‌గా ఉన్నారు.

why ap bjp is silent when pawan is asking

సనాతన ధర్మ పరిరక్షణ, ఆలయాలు, చర్చిలు, మసీదుల గురించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్న మాటలు వినన్నట్లు అందరూ మౌనంగా ఉండిపోవడం కూడా . ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు చాలా తక్కువే కావచ్చు కానీ బీజేపీ హిందూమతం ఆధారంగానే రాజకీయాలు చేస్తుంటుంది. కనుక యావత్ దేశాన్ని కుదిపేస్తున్నా ఈ అంశంపై చాలా మాట్లాడి ఉండాలి. కానీ ఏపీ బీజేపీ నేతలు మొక్కుబడి ఖండనలతో సరిపెట్టారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లను శుభ్రం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కొందరు లడ్డూ అపచారంపై పిచ్చిమాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లడ్డూ అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే.. ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి ఏం సంబంధం?’ అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

Sam

Recent Posts