Vitamin B12 Deficiency Symptoms : శరీరానికి పోషకాహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. అన్ని రకాల పోషక పదార్థాలు అందేటట్టు, మనం చూసుకోవాలి. విటమిన్ బీ12 ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, విటమిన్ బి12 చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ నిర్వహణకు కూడా విటమిన్ బి12 చాలా అవసరం. విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే, కచ్చితంగా కొన్ని సమస్యలు వస్తాయి. మన శరీరం సొంతంగా విటమిన్ బి12 ని ఉత్పత్తి చేయలేదు.
దానిని మనం ఆహారం లేదంటే సప్లిమెంట్స్ ద్వారా పొందాలి. విటమిన్ బి12 మాంసం, చేపలు, సోయాబీన్స్, ఎర్ర మాంసం, పీతలు, పాలు, గుడ్లు, తృణధాన్యాలలో లభిస్తుంది. మెదడు, నరాల కణాల పనితీరు అభివృద్ధికి బీ12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 ఒంట్లో తక్కువ ఉందని, ఎలా చెప్పచ్చు అనే విషయానికి వస్తే… అలసటగా ఉండడం, బలహీనంగా అనిపించడం వంటివి విటమిన్ బి12 లోపం లక్షణాలు అని చెప్పొచ్చు.
విటమిన్ బి12 తగ్గినప్పుడు, అలా వదిలేస్తే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారి తీస్తుంది. అలసట, నీరసం, శక్తి లేకపోవడం, నాలుక ఎర్రగా మారడం వంటివి కలిగితే ఖచ్చితంగా విటమిన్ బి12 లోపం ఉందని మీరు తెలుసుకోవచ్చు. తక్కువ విటమిన్ బి12 స్థాయిలు ఉంటే, ఏకాగ్రత కోల్పోతారు. జ్ఞాపక శక్తి సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి. నిరాశ, చిరాకు వంటి మానసిక రుగ్మతలకు కూడా దారితీస్తుంది.
కనుక, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, విటమిన్ బి12 లోపంని వెంటనే పరిష్కరించుకోవడం అవసరం. మానవ శరీరంలో, విటమిన్ బి12 సాధారణ స్థాయిలో 300 pg/ml కంటే తక్కువ ఉన్నట్లయితే, దాన్ని సాధారణమైన దానిగా పరిగణిస్తారు. అదే ఒకవేళ, 200 pg/ml కంటే తక్కువ ఉన్నట్లయితే దానిని లోపంగా భావిస్తారు.