అమ్మతనం అనేది ఆడవారికి మాత్రమే ఉన్న అద్బుత వరం… తల్లికాబోతున్న వారికి చాలామంది చాలా జాగ్రత్తలు ,చాలా సూచనలు చెప్తుంటారు… కానీ ప్రెగ్నెన్సీ గురించి, ప్రెగ్నెంట్స్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అనేది తొమ్మిదినెలలు అని మనకు తెలుసు. కానీ లాస్ ఏంజెల్స్ కు చెందిన బూలా హంటర్ అనే ఆమె 1975లో 375రోజుల తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చింది…అంటే అక్షరాలా పన్నెండు నెలల పదిరోజుల తర్వాత అన్నమాట…సాధారణంగా అబ్బాయిలు తొమ్మిదినెలలలో,అమ్మాయిలు పదోనెలలో పుడతారు అని కూడా మన పెద్దవాళ్లు అంటూంటారు..
ప్రెగ్నెన్సీ టైంలో గర్భాశయం మాములు టైంలో కన్నా 500రెట్లు ఎక్కువ సాగుదల గుణం కలిగి ఉంటుంది. మాములుగా చెప్పాలంటే ఒక పుచ్చకాయ సైజ్ అన్నమాట.. ప్రెగ్నెన్సీ టైంలలో రుచిని గ్రహించే శక్తి కన్నా , వాసన ను గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. పొట్టలోపల బేబి ఏడుస్తుంది.. కానీ మధర్ కూడా దాన్ని గ్రహించలేదు… ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.. ఏది తిన్నా కూడా ఇంకా ఏదో తినాలన్పిస్తుంటుంది.. లేదా కొన్ని ఐటమ్స్ తినాలన్పించదు.. దీనికి కారణం బేబీస్ కూడా టేస్ట్ చేస్తాయి .. ప్రెగ్నెన్సీ టైం లో ప్రెగ్నెంట్ లేడీ పాదం ఫుల్ షూజ్ సైజ్ పరిమాణం పెరుగుతుంది.
పొడవుగా ఉండి, అధిక బరువు ఉన్న వారిలో మల్టిపుల్ బర్త్స్ (బహుళ జననాలు) కలిగే అవకాశాలు ఎక్కువ.. చాలామందిలో డెలివరీ తర్వాత కొన్ని కాన్ ట్రాక్షన్స్ కనబడతాయి…ఇవి రక్త స్రావాన్ని ఆపడానికి ఉపయోగపడే సహజమార్గాలు.. శిశువుకు వేలిముద్రలు గర్భం దాల్చిన తర్వాత మొదటి మూడు నెలలలోనే ఏర్పడతాయి.. గర్భాశయంలోనే బేబీస్ మూత్రవిసర్జన చేస్తారు.. మళ్లీ దానినే తాగుతారు… కొన్ని సందర్బాలలో ఓరల్ సెక్స్ ద్వారా కూడా ఒక స్త్రీ గర్బం పొందే అవకాశం ఉంది.. ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఏదైనా అవయవానికి సంబంధించి ఇబ్బంది పడుతుంటే ఆ అవయవాన్ని క్యూర్ చేసే మూలకణాన్ని బేబీ పంపిస్తుంది…