Monkeypox First Case : కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఎలా అల్లకల్లోలం అయిందో అందరికీ తెలిసిందే. కొన్ని కోట్ల మంది కరోనా బారిన పడి చనిపోయారు. అయితే ఆ విషాదం ఇంకా మరిచిపోక ముందే మళ్లీ దేశంలోకి ఇంకో కొత్త వైరస్ వచ్చి చేరింది. ఇతర దేశాల్లో ఈ వైరస్ ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నా.. మన దేశంలోకి మాత్రం ఈ వైరస్ తాజాగా ఎంట్రీ ఇచ్చింది. ఒక వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇతర దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించారు. దీంతో వెంటనే అతడిలో ఎంపాక్స్ లక్షణాలు నిర్దారణ అయ్యాయి. ఈ క్రమంలో అతన్ని హాస్పిటల్‌లో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆ వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు ఉండడంతో అతనికి వైద్యులు పరీక్షలు చేశారు. దీంతో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అయితే దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో ప్రజలందరూ హడలిపోతున్నారు.
అయితే మంకీ పాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా మంకీ పాక్స్‌ను ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక మంకీ పాక్స్ సోకిన సదరు వ్యక్తిని ప్రత్యేకంగా ఐసొలేషన్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అతను ఇండియాకు వచ్చాక ఎక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడు.. అన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే అతన్ని కలిసిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. దీంతో కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.