Kidneys Health : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి రోజుకు గంటకు రెండు సార్లు 5 లీటర్ల రక్తాన్ని శుద్ది చేస్తూ శరీరంలోని మలినాలను, విష పదార్థాలను తొలగిస్తూ ఉంటాయి. రోజూ 48 సార్లు 5 లీటర్ల రక్తాన్ని ఇవి శుద్ది చేస్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాటి విలువ ఎవరికి తెలియదు. ఒక్కసారి అవి పాడవగానే ఈ మూత్రపిండాలు మన శరీరంలో ఎన్ని విధులను నిర్వర్తిస్తున్నాయే తెలుస్తుంది. కనుక మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మూత్రపిండాలు నిర్వర్తించే విధుల గురించి తెలిస్తేనే మనం వాటి ఆరోగ్యంపై శ్రద్ద చూపించగులుగుతాము. కనుక మన శరీరంలో ఉండే మూత్రపిండాలు ఏయే విధులను నిర్వర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రపిండాలు మన శరీరంలో ఎక్కువగా ఉండే నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అలాగే ఈ మూత్రంతో శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్స్ ను కూడా రోజూ బయటకు పంపిస్తాయి. అదే విధంగా రక్తంలో ఆమ్లతత్వం పెరగకుండా నిరోధించడంలో కూడా మూత్రపిండాలు మనకు సహాయపడతాయి. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు మిగిలిన నీరు కూడా మూత్రం ద్వారా బయటకు పోకుండా శరీరం మరింత డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడడంలో కూడా మూత్రపిండాలు మనకు దోహదపడతాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచే హార్మోన్లను మూత్రపిండాలు విడుదల చేస్తాయి.
కనుక మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి బీపీ అదుపులో ఉండదు. ఎండ వల్ల మన శరీరానికి అందిన మన విటమిన్ డి మన శరీరానికి పట్టేలా చేయడంలో కూడా మూత్రపిండాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే మూత్రపిండాలు దెబ్బతిన్న వారిలో రక్తం ఉత్పత్తి తగ్గి రక్తహీనత సమస్య తలెత్తుతుంది. మనం వాడే మందుల్లో ఉండే రసాయనాలను, విష పదార్థాలను 80 శాతం వరకు మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఉండే రసాయనాలు, పురుగు మందులను కూడా విఛ్చినం చేసిమూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే కనుక ఈ విష పదార్థాలు, రసాయనాల్ని కూడా శరీరంలో పేరుకుపోతాయి. రక్తం విష పూరితమవుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా మూత్రపిండాలు మనకు దోహదపడతాయి.
అలాగే రక్తంలో మినరల్స్ స్థాయిలు తగ్గకుండా మినరల్స్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో కూడా మూత్రపిండాలు సహాయపడతాయి. ఇలా అనేక రకాల విధులను మూత్రపిండాలు మన శరీరంలో నిర్వర్తిస్తాయి. కనుక వీటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎక్కువగా దెబ్బతీస్తాయి. కనుక ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూసుకోవాలి. అలాగే ఈ సమస్యలతో బాధపడే వారు వీటిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవాలి. నిల్వ పచ్చళ్లను తీసుకోకూడదు. రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మనం జీవించినంత కాలం మూత్రపిండాలు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.