Drumsticks Egg Tomato Curry : మ‌సాలాలు లేకుండా నోటికి క‌మ్మ‌గా ఉండే ముల‌క్కాడ గుడ్డు కూర‌.. త‌యారీ ఇలా..!

Drumsticks Egg Tomato Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయ‌లు కూడా ఒక‌టి. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ముల‌క్కాడ ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఉడికించిన కోడిగుడ్లు, మున‌క్కాయ‌ల‌తో క‌లిపి చేసే ఈ కూర‌చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి మ‌సాలాలు లేకుండా రుచిగా, క‌మ్మ‌గా ఉండేలా ఈమున‌క్కాయ ఎగ్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముల‌క్కాడ ఎగ్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 5, త‌రిగిన మున‌క్కాయ – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటాలు – 4, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్,ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – అర గ్లాస్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Drumsticks Egg Tomato Curry recipe in telugu make in this way
Drumsticks Egg Tomato Curry

ముల‌క్కాడ ఎగ్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఉడికించిన కోడిగుడ్ల‌కు ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, మున‌క్కాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి. వీటిని ఇలా 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి.

ఇందులోనే ఉడికించిన కోడిగుడ్లు కూడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మున‌క్కాయ ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముల‌క్కాయ ఎగ్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మున‌క్కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఎగ్ క‌ర్రీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts