Lung Cancer : క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి అన్న విషయం అందరికీ తెలిసిందే. దీని బారిన పడితే ఆరంభంలో చాలా మందిలో లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ క్రమంగా లక్షణాలు కనిపిస్తాయి. దీంతో ఆ దశలో చికిత్స తీసుకుంటారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అదే లక్షణాలను ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్‌ను అడ్డుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ప్రాణాలను కాపాడుకోవచ్చు కూడా. ఇక మన శరరీంలో అనేక భాగాలకు క్యాన్సర్ వస్తుంది. వాటిల్లో లంగ్ క్యాన్సర్ (ఊపిరితిత్తుల క్యాన్సర్) కూడా ఒకటి. ఇది వస్తే ఆరంభంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లంగ్ క్యాన్సర్ వచ్చిన వారిలో ఆరంభంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా క్యాన్సర్ వచ్చిందని ముందుగానే తెలుసుకోవచ్చు. దీంతో డాక్టర్‌ను కలిసి ముందుగానే చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ను నయం చేసుకోవచ్చు. దీంతో ప్రాణాలను కాపాడుకున్న వారమవుతాము. ఇక లంగ్ క్యాన్సర్ ఆరంభంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. ఈ క్యాన్సర్ ఉన్నవారికి శ్వాస సరిగ్గా ఆడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఎలాంటి దగ్గు, జలుబు, శ్వాస కోశ సమస్యలు లేకున్నప్పటికీ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందంటే.. అది లంగ్ క్యాన్సర్ ఏమోనని అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
ఇక లంగ్ క్యాన్సర్ ఉన్నవారి గొంతు కూడా మారిపోతుంది. ఉన్నట్లుండి సడెన్ గా ఎలాంటి దగ్గు లేకున్నా గొంతు మారిందంటే.. దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. అలాగే ఈ క్యాన్సర్ ఉన్నవారిలో తరచూ ఛాతిలో నొప్పి వస్తుంటుంది. దీంతోపాటు కంటి రెప్పలు వాపులకు గురై కనిపిస్తాయి.
లంగ్ క్యాన్సర్ ఉన్నవారిలో తరచూ కడుపు నొప్పి కూడా వస్తుంటుంది. ఫుడ్ అలర్జీలు అవుతుంటాయి. పొగ ఏమాత్రం పడదు. పొగ పీలిస్తే ఊపిరి తీసుకోలేకపోతుంటారు. అలాగే చేతి వేళ్లు లావుగా అయి కనిపిస్తాయి. ముఖం సడెన్ గా ఉబ్బిపోయినట్లు కనిపిస్తుంది. ఇవన్నీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని చెప్పే లక్షణాలే. కనుక ఈ లక్షణాలు ఉంటే ఎవరైనా సరే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా ఉందని తేలితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో క్యాన్సర్ వ్యాధి తీవ్రతరం కాకుండా.. ప్రాణాలు పోకుండా.. ముందుగానే జాగ్రత్త పడవచ్చు.