Nerve Burning : మీ పాదాలు, చేతుల్లో న‌రాల మంట‌లు వ‌స్తున్నాయా.. అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

Nerve Burning : మన‌లో చాలా మందికి పాదాల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వీటినే అరికాళ్ల‌ల్లో మంట‌లు అని కూడా అంటారు. ఈ మంట‌లు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి. దీనినే పెరిఫిరల్ న్యూరోప‌తి అంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి బాధ వ‌ర్ణణాతీతం అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య కార‌ణంగా వారు న‌డ‌వ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. న‌డిచేట‌ప్పుడు విప‌రీత‌మైన బాధ‌, నొప్పి క‌లుగుతుంది. పాదాల్లో న‌రాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో న‌రాల‌పై ఒక క‌వ‌చం ఉంటుంది. ఈ క‌వ‌చం దెబ్బ‌తిన‌డం వ‌ల్ల న‌రాల మంట‌లు వ‌స్తూ ఉంటాయి. ఇలా న‌రాలు దెబ్బ‌తిని వివిధ కార‌ణాలు ఉంటాయి.

న‌రాలు దెబ్బ‌తిని పాదాల్లో మంట‌లు రావ‌డానికి గ‌ల కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ కార‌ణంగా న‌రాలు ఎక్కువ‌గా దెబ్బ‌తింటాయి. ర‌క్తంలో ఉండే చ‌క్కెర న‌రాల క‌ణాల‌కు స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం వ‌ల్ల అలాగే న‌రాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క పోవ‌డం వ‌ల్ల న‌రాలు దెబ్బ‌తింటాయి. దీంతో పాదాలు మంట‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే శ‌రీరంలో విట‌మిన్ బి12 లోపించ‌డం వ‌ల్ల కూడా న‌రాలు దెబ్బ‌తింటాయి. న‌రాల‌పై ఉండే క‌వ‌చం త‌యార‌వ్వాలంటే మ‌నకు విట‌మిన్ బి 12 అవ‌స‌ర‌మ‌వుతుంది. ఈ విట‌మిన్ లోపించ‌డం వ‌ల్ల న‌రాల‌పై క‌వ‌చం స‌రిగ్గా త‌యార‌వ్వ‌క న‌రాలు దెబ్బ‌తింటాయి. అదే విధంగా స‌యాటికా న‌రం ఒత్తిడికి గురి అవ్వ‌డం వల్ల కూడా అరికాళ్ల‌ల్లో మంట‌లు వ‌స్తూ ఉంటాయి.

Nerve Burning sensation in feet and hands reasons and tips
Nerve Burning

అలాగే శ‌రీరంలో ర‌క్తం త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా పాదాల‌ల్లో వ‌స్తాయి. శ‌రీరంలో ర‌క్తం త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల పాదాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగ‌క పాదాల్లో మంట‌లు వస్తాయి. అలాగే హెచ్ఐవి తో బాధ‌ప‌డే వారిలో కూడా న‌రాల్లో మంట‌లు వ‌స్తాయి. ఇక కొన్ని ర‌కాల ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్స్ కూడా న‌రాల్లో మంట‌ల‌కు దారి తీస్తాయి. అదే విధంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డే వారు కిమో థెర‌పీ తీసుకుంటూ ఉంటారు. కిమో థెర‌పీ ఫ్ర‌భావం వల్ల న‌రాలు దెబ్బ‌తిని న‌రాల్లో మంట‌లు వ‌స్తూ ఉంటాయి. మూత్ర‌పిండాల్లో వైఫ‌ల్యం చెందిన, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు కూడా న‌రాల్లో మంట‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల న‌రాలు దెబ్బ‌తింటాయి. దీంతో న‌రాల్లో మంట‌లు వ‌స్తూ ఉంటాయి.

ఈ కార‌ణాల చేత న‌రాలు దెబ్బ‌తిని పాదాల్లో మంట‌లూ వ‌స్తూ ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా పాదాల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డే వారు ముందుగా వైద్యున్ని సంప్ర‌దించి ఏ కార‌ణం చేత ఈ స‌మ‌స్య వ‌చ్చింతో తెలుసుకోవాలి. అలాగే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ముందుగా నొప్పి, మంట త‌గ్గడానికి గ‌ట్టిగా ఉండే చెప్పులు కాకుండా మెత్త‌గా ఉండే ఆర్థో చెప్పులను వాడాలి. అలాగే రోజూ 15 నుండి 20 నిమిషాల‌పాటు పాదాల‌ను చ‌ల్ల‌టి నీటిలో ఉంచాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయ‌వ‌చ్చు. ఇక ప‌డుకునేట‌ప్పుడు పాదాల కింద దిండును ఉంచి ప‌డుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొంత‌వ‌ర‌కు మంట‌లు త‌గ్గుతాయి.

అలాగే ప్ర‌తిరోజూ కాళ్ల‌కు, పాదాల‌కు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. న‌రాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి. వారానికి రెండు సార్లు పుట్ట‌గొడుగుల‌ను తీసుకోవాలి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు డ‌యాబెటిస్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పాదాల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌గిన చికిత్స తీసుకుంటూ ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి మంట‌లు, నొప్పులు త్వ‌రగా తగ్గుతాయని న‌రాలు మ‌రింత ఎక్కువ‌గా దెబ్బ‌తినకుండా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts