Salt : ఉప్పు, థైరాయిడ్.. ఈ రెండింటికీ ఉన్న అస‌లు సంబంధం ఏమిటో తెలుసా..?

Salt : ప్ర‌స్తుత కాలంలో చాప కింద నీరులా విస్త‌రిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ కూడా ఒక‌టి. షుగ‌ర్, బీపీ వంటి వాటితోపాటు థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు ప్ర‌తిరోజూ దీర్ఘ‌కాలం పాటు మందుల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ స‌మ‌స్య చాలా కాలం నుండి ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తోంది.

the relation between Salt and Thyroid
Salt

అయోడిన్ లోపం కార‌ణంగా థైరాయిడ్ స‌మ‌స్య వ‌స్తుందని మ‌నంద‌రికీ తెలుసు. అయోడిన్ క‌లిపిన ఉప్పును ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయోడిన్ క‌లిపిన ఉప్పును ఉప‌యోగించిన‌ప్ప‌టికీ థైరాయిడ్ స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారి సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. థైరాయిడ్ లో హైప‌ర్ థైరాయిడ్, హైపో థైరాయిడ్ అనే రెండు ర‌కాలు ఉంటాయి. అయోడిన్ ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల హైప‌ర్ థైరాయిడ్ బారిన ప‌డ‌తామ‌ని, అయోడిన్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల హైపో థైరాయిడ్ బారిన ప‌డ‌తామ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌న‌లో చాలా మంది హైపో థైరాయిడ్ తో బాధ‌ప‌డుతున్నార‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. కేవ‌లం అయోడిన్ ను క‌లిపిన ఉప్పును ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్లే మ‌నం హైపో థైరాయిడ్ బారిన ప‌డుత‌న్నామ‌ని వైద్య శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. పూర్వ‌కాలంలో సాధార‌ణ ఉప్పును ఉప‌యోగించ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య వ‌చ్చినా త‌క్కువ‌గా వ‌చ్చేద‌ని, అయోడిన్ ను క‌లిపిన ఉప్పును ఉప‌యోగించ‌డం మొద‌లు పెట్టిన దగ్గ‌రి నుండి థైరాయిడ్ బారిన ప‌డే వారు ఎక్కువవుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు.

అయోడిన్ ను క‌లిపిన ఉప్పును ఉప‌యోగించ‌డం మానేసి స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జీవిత‌కాలం మందులు వాడే అవ‌సరం లేకుండా కేవ‌లం మూడు నెల‌ల‌లోనే థైరాయిడ్ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. అయోడిన్ ను క‌లిపిన ఉప్పును ఉప‌యోగించ‌డం వల్ల థైరాయిడ్ స‌మ‌స్య లేని వారిలో కూడా అది వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts