Dark Circles : క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను తగ్గించే అద్భుత‌మైన చిట్కా..!

Dark Circles : ఎన్నో ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడిన‌ప్ప‌టికీ మ‌న క‌ళ్ల కింద ఉండే న‌ల్లని వ‌ల‌యాల‌ను తొల‌గించకోలేక‌పోతుంటాం. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌, క‌ళ్ల‌ను ఎక్కువ‌గా న‌ల‌ప‌డం వ‌ల్ల‌, కంప్యూట‌ర్, ఫోన్ వంటి వాటిని ఎక్కువ‌గా చూడ‌డం వ‌ల్ల, క‌ళ్ల అల‌స‌ట కార‌ణంగా, జీవ‌న విధానం కార‌ణంగా కూడా మ‌న క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. దీర్ఘ‌కాలికంగా మందుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు వ‌స్తాయి.

follow this wonderful remedy for Dark Circles
Dark Circles

అంతేకాకుండా జ‌న్యు ప‌రంగా కూడా కొంద‌రిలో క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు వ‌స్తాయి. ఇవి స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ వ‌స్తాయి. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు రావ‌డానికి వ‌య‌స్సుతో సంబంధం ఉండ‌దు. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు రావ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి స‌మ‌స్యా లేక‌పోయిన‌ప్ప‌టికీ వీటి కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాల‌ కార‌ణంగా మ‌నం ఎక్కువ‌గా అల‌సిపోయిన‌ట్టుగా కనిపిస్తాం.

ఖ‌రీదైన సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడిన‌ప్ప‌టికీ ఒక్కోసారి ఈ వ‌ల‌యాలు పోకుండా అలాగే ఉంటాయి. ఈ సౌంద‌ర్య సాధ‌నాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల దుష్ఫ్ర‌భావాల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాల‌ను ఇంటి చిట్కాను ఉప‌యోగించి ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవలం మ‌న ఇంట్లో ఉండే వాటితోనే త‌గ్గించుకోవ‌చ్చు. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాల‌ను తొల‌గించే ఆ ఇంటి చిట్కా ఏమిటి.. ఇందులో ఉప‌యోగించాల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఆ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందు కోసం ముందుగా రెండు టీ స్పూన్ల ట‌మాటా ర‌సాన్ని, ఒక‌టీ స్పూన్ బియ్యం పిండిని, చిటికెడు ప‌సుపును తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ట‌మాటా ర‌సాన్ని తీసుకుని అందులో ప‌సుపును, బియ్యం పిండిని వేసి పేస్ట్ లా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద ఉండే న‌ల్లని వ‌ల‌యాల‌పై రాసి బాగా ఆరిన త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల క్ర‌మంగా చాలా త్వ‌ర‌గా క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు తొల‌గిపోతాయి. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌డంతోపాటు ఎలాంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు.

D

Recent Posts