Urine Color : మూత్రం రంగు మారిందా.. అయితే ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!

Urine Color : మ‌న శరీరంలో కిడ్నీలు ముఖ్య‌పాత్ర‌ను పోషిస్తాయి. మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో మూత్రం బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు విస‌ర్జించే మూత్రం లేత ప‌సుపు రంగులో ఉంటుంది. కానీ ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం మూత్రం రంగు మారి వ‌స్తుంది. ఇలా మూత్రం గ‌న‌క మీకు కూడా రంగు మారి వ‌స్తుందంటే.. మీ శ‌రీరంలో ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య ఉన్న‌ట్లే లెక్క‌. అలాంట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. ఇక మూత్రం రంగును బ‌ట్టి మ‌న శ‌రీరంలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమరంగులో మూత్రం వస్తుంటే.. లివర్ సంబంధ వ్యాధితో బాధ‌పడుతున్నారని అర్థం. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవడం మంచిది. చాలామంది ఆరోగ్య సంబంధిత టాబ్లెట్స్ వాడుతుంటారు. విటమిన్, క్యాన్సర్ ట్యాబ్లెట్లు లాంటివి వాడడం వల్ల మూత్రం నీలం రంగు లేదా ఆకుపచ్చ రంగులో వస్తుంది. మూత్రం ఇలా వస్తే జన్యుపర వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Urine Color and diseases you have know them
Urine Color

గులాబీ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తే మూత్రపిండ వ్యాధులు, కణతులు, లివర్ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు వచ్చే ప్రమాదాలుంటాయి. అలాకాకుండా ఎరుపు, పింక్ రంగులో ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నా కూడా రంగు మారే అవకాశాలుంటాయి. క‌నుక అలాంటి ఆహారం తీసుకోకున్నా మీకు మూత్రం ఆ రంగులో వ‌స్తుందంటే అప్పుడు అనుమానించాల్సిందే. వెంట‌నే జాగ్ర‌త్త‌ప‌డి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

ముదురు పసుపు, కమలాపండు రంగులో మూత్రం వస్తుంటే.. పెద్దగా ఆలోచనలో పడాల్సిన అవసరం లేదు. లివర్ వ్యాధులు ఉన్నాయని నిర్థారించుకోవచ్చు. శరీరంలోని తేమను బట్టి కూడా ఇలా జరుగుతుంది. మూత్రం తేనె రంగులో కనిపిస్తే.. డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై మూత్రం రంగు మారుతుంటుంది. దీనికి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాతం నీరు తీసుకుంటే సరిపోతుంది. లేతపసుపు రంగులో మూత్రం ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. ఇలా మూత్రం రంగును బ‌ట్టి మ‌న‌కు ఉండే స‌మ‌స్య‌ల‌ను గురించి సుల‌భంగా తెలుసుకోవచ్చు. దీంతో కిడ్నీలు పాడ‌వ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అవ‌స‌ర‌మైన మేర చికిత్స తీసుకుని సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts