Snoring : గుర‌క స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Snoring : స‌హ‌జంగా చాలా మంది వ్యక్తులు నిద్రలో గురక పెడుతుంటారు. వీరి వల్ల ప‌క్క‌నే ఉండేవారికి చాలా ఇబ్బంది క‌లుగుతుంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు గుర‌క పెడుతూనే ఉంటారు. త‌ప్పితే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయ‌రు. అయితే గుర‌క వ‌ల్ల చాలా మందికి స‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు కూడా. వాస్త‌వానికి గురక పెట్టేవారికన్నా పక్కనున్నవారే ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డ‌తారు. ఇక గుర‌క వ‌చ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే దీనికి కొన్ని చిట్కాల‌ను పాటిస్తే చాలు. వీటిని రాత్రి పూట పాటించాలి. దీంతో గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..

ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల గుర‌క స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. వెల్లకిలా కాకుండా ఏదైనా ఒక వైపుకు తిరిగి పడుకుంటే గురక రాదు. అంతేకాకుండా తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా గురక రాకుండా ఆపుతుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్‌ అవుతుంది.

follow these natural home remedies for Snoring
Snoring

ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా యాలకుల పొడి కలిపి నిద్ర పోయే ముందు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గురక సమస్య త‌గ్గుతుంది. తేనెలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల‌ మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి పూట భోజనంలో పచ్చి ఉల్లిపాయను తినాలి. దీంట్లో ఉండే సల్ఫర్ యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో గురక సమస్య త‌గ్గుతుంది. గోరువెచ్చని పాలలో ప‌సుపును వేసుకొని తాగడం వల్ల శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి. దీంతో గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇలా గుర‌క స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Editor

Recent Posts