Lachha Paratha : పంజాబీ స్పెష‌ల్ ల‌చ్చా ప‌రాటా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Lachha Paratha : ల‌చ్చా ప‌రాట‌… పంజాబీ స్పెష‌ల్ వంట‌క‌మైనా ఈ ప‌రాట మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే ఈ ల‌చ్చా ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ల‌చ్చా ప‌రాటాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ల‌చ్చా ప‌రాట త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – కొద్దిగా, పంచ‌దార – ఒక టీ స్పూన్, బొంబాయి ర‌వ్వ – 2 టీ స్పూన్స్, నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్స్.

Lachha Paratha recipe in telugu very easy way delicious
Lachha Paratha

ల‌చ్చా ప‌రాట త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఉప్పు, పంచ‌దార‌, బొంబాయి ర‌వ్వ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి సాధ్య‌మైనంత ఎక్కువ సేపు మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత నూనె వేసి మ‌రో 5 నిమిషాల పాటు క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని స‌మాన భాగాలుగా చేసుకుని గుండ్ర‌ని ముద్ద‌లుగా చేసుకోవాలి. త‌రువాత నూనెను రాసి త‌డి వ‌స్త్రాన్ని క‌ప్పి 30 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచుకోవాలి. తరువాత ఒక్కో ముద్ద‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ సాధ్య‌మైనంత ప‌లుచ‌గా చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత దానిపై ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ప‌రాటా అంతా వ‌చ్చేలా రాసుకోవాలి. త‌రువాత దానిపై పొడిని చ‌ల్లుకోవాలి. ఇప్పుడు చాకును తీసుకుని వ‌త్తుకున్న ప‌రాటాను వీలైనంత స‌న్న‌గా పొడుగ్గా క‌ట్ చేసుకోవాలి.

త‌రువాత చాకుతో వీట‌న్నింటిని ఒక ద‌గ్గ‌రికి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చివ‌రి నుండి ప‌రాటాను గుండ్రంగా చుట్టుకోవాలి. త‌రువాత దీనిపై పొడి చ‌ల్లుకుంటూ మ‌రీ ప‌లుచ‌గా కాకుండా చ‌పాతీలా వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న ప‌రాటాను బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. త‌రువాత రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా కాల్చుకున్న త‌రువాత ప‌రాటాల‌ను ఒక దాని మీద ఒక‌టి వేసి రెండు చేతుల‌తో వ‌త్తుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొర‌లు పొర‌లుగా ప‌రాటా విడిపోతుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మెత్త‌గా, పొర‌లు పొర‌లుగా ఉండే ల‌చ్చా ప‌రాటా త‌యార‌వుతుంది. దీనిని వెజ్, నాన్ వెజ్ మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌రాటాను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts