రక్తంలో హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ లెవల్‌లో ఉండాలి. హిమోగ్లోబిన్ వల్లనే మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఆక్సిజన్‌ను రవాణా చేయడంతో పాటు హిమోగ్లోబిన్ కార్బన్ డై ఆక్సైడ్‌ను ఎర్రరక్త కణాల నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్తకణాలు నశించిపోవడం, ఏదైనా ఆరోగ్యసమస్య వల్ల ఎక్కువగా రక్తం పోవడం వంటి కారణాల వల్ల హిమోగ్లోబిన్ తక్కువగా తయారవుతుంది. శరీరంలో ఎర్రరక్త కణాలు సరిగ్గా ఉత్పత్తికానప్పుడు, రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి కావు. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల శరీర భాగాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఉన్నప్పుడు రక్తహీనత సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది.
ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉండటం వల్ల అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిస్సత్తువ, హార్మోన్ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గటం, జుట్టు రాలటం, చర్మం పాలిపోవటం, గర్భిణుల్లో గర్భస్రావం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. థైరాయిడ్, కిడ్నీలు లేదా కాలేయ సమస్య ఉండటం వల్ల, విటమిన్ బీ 12, ఫోలిక్ ఆసిడ్ వంటి విటమిన్ల లోపం వల్ల కూడా హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి ఐరన్ బాగా పనిచేస్తుంది.హిమోగ్లోబిన్ యొక్క సాధారణ స్థాయి పురుషులు మరియు స్త్రీలలో భిన్నంగా ఉంటుంది. పురుషులకు, సాధారణ స్థాయి 14.0 నుండి 17.5 g/dL మధ్య ఉంటుంది, అయితే మహిళలకు సాధారణ స్థాయి 12.3 నుండి 15.3 g/dL మధ్య ఉంటుంది. పురుషులలో 13 g/dL మరియు స్త్రీలలో 12 g/dL కన్నా తక్కువగా ఉంటే డేంజర్ అని చెప్పవచ్చు.
హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల శరీరంలోని కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్ సరిగా అందదు. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి కారణంగా, ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే సామర్థ్యం ప్రభావితమవుతుంది, దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. రక్తహీనత కారణంగా చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. అలాంటి సమస్య ఉన్నప్పుడు పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులను చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. టీ, కాఫీ, సోడా, ఆల్కహాల్‌లను దూరం పెట్టాలి.