Pomegranate Seeds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో దానిమ్మ పండ్లు ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దానిమ్మ పండ్లు అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక దానిమ్మ పండ్లను కొందరు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. ఈ జ్యూస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఒక కప్పు దానిమ్మ పండు గింజలను తింటే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దానిమ్మ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్వరం కూడా తగ్గుతుంది.
2. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజూ దానిమ్మ పండు గింజలను తింటుంటే బరువు త్వరగా తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
3. రక్తహీనత సమస్య ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటే రక్తం బాగా తయారవుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
4. షుగర్, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ దానిమ్మ పండ్ల గింజలు తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. ఒక్క నెల రోజుల పాటు వీటిని రోజూ తింటే.. అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. మీ శరీరంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు.