వైద్య విజ్ఞానం

సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి.. దాని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే..?

సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలకి వచ్చే ఒక రకమైన క్యాన్సర్‌గా చెబుతారు. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ కి సంబంధించిన వివిధ జాతులు సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్విక్స్‌ అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. ఇది గర్భాశయానికి ముఖ ద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. రొమ్ము క్యాన్సర్‌ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్‌ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ వైరస్‌ను గుర్తించి నివారించకపోతే ఇది గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది

గర్భాశయ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే చికిత్స చేయవచ్చు. మీకు నిరంతరంగా యోని లో దురద లేదా మండుతున్న అనుభూతిని కలిగి ఉంటే, అది గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు, మూత్ర విసర్జన విధానాలలో మార్పులు కూడా గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం. మీరు నిరంతరం ఉబ్బరం కలిగి ఉంటే, ప్రత్యేకించి అది పెల్విక్ నొప్పి లేదా ప్రేగు అలవాట్లలో మార్పులు వంటి ఇతర లక్షణాలతో కూడి ఉంటే, అది గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. నడుము నొప్పి లేదా పొత్తికడుపు నొప్పి కూడా ఒక ల‌క్ష‌ణంగా చెప్ప‌వ‌చ్చు. మీకు నిరంతరంగా నొప్పి ఉంటే సాధారణ చికిత్సలతో అది తగ్గకపోతే, మీరు వైద్యుడిని సంప్ర‌దించ‌డం మేలు.

what is cervical cancer and its symptoms

గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి HPV వ్యాక్సిన్ ఉంటుంది. దీని గురించి మీ డాక్టర్‌ని అడగండి. HPV సంక్రమణను నివారించడానికి టీకాను తీసుకోవడంతో సర్వైకల్ క్యాన్సర్, ఇతర HPV సంబంధిత క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించొచ్చు. క్యాన్సర్ రకాన్ని బట్టి, తీవ్రతని బట్టి మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌ని సూచిస్తారు. సురక్షితమైన శృంగారం, లైంగిక సంక్రమణలను నివారించేందుకు చర్యలు తీసుకుంటే మీ గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. పొగ త్రాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే దానికి దూరంగా ఉండడం మంచిది.అదే విధంగా, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే డాక్టర్ సలహాతో సరైన లైఫ్‌‌స్టైల్ పాటించడం మంచిది.

Sam

Recent Posts