వైద్య విజ్ఞానం

రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు 3 ముఖ్య‌మైన కార‌ణాలు ఇవే..!

బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనేది ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వింటున్నాం. గ‌తంలో ఎవరికో ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వ‌చ్చేది .ఇప్పుడు అలాకాదు.. వయసులో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. రొమ్ము క్యాన్సర్ చాప కింద నీరులా చేరి పెద్ద సమస్యగా మారేవరకు బయట పడదు. ఈ కారణంగా చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ కు బలవుతూ ఉంటారు. నివేదికల ప్రకారం.. 2012-2021 మధ్య కాలంలో అమెరికాలో 50 ఏళ్ల లోపు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఏటా 1.4% పెరిగాయి. అయితే ఈ ట్రెండ్ అందరిలోనూ ఒకేలా లేదు. ఆసియా దేశాల నుంచి వచ్చిన అమెరికన్ మహిళల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. పసిఫిక్ ఐలాండర్ మహిళల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు చూస్తే.. రొమ్ములో వాపు లేదా ఉబ్బు,చనుమొన నుంచి ఏవైనా స్రావాలు రావడం, చనుమొన, రొమ్ము చర్మం ఎరుపెక్కడం,చనుమొన కాస్త లోపలికి వెళ్లినట్లు అవ్వడం,భుజం, చేయి, చంకల్లో వాపు, గడ్డ ఉన్నా లేకపోయినా.. వీటిలో ఏమైనా లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ప్రతిసారీ ఇవి క్యాన్సర్ సూచనలే కాకపోయినా నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. స్థూల‌కాయం, మందు, డ్ర‌గ్స్ , సిగ‌రెట్ వంటి అల‌వాట్లు కూడా బ్రెస్ట్ క్యాన్స‌ర్‌కి కార‌ణ‌మ‌ని అంటున్నారు వైద్యులు.తల్లి, చెల్లి.. ఇలా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మీకొచ్చే ప్రమాదం రెట్టింపు అవ్వచ్చు..వంశపార్యంగా రావచ్చు..పొగత్రాగడం వల్ల ప్రమాదం పెరుగుతుంది, ఆల్కహాల్ వల్ల, వ్యాయామం లేని జీవన శైలి వల్ల కూడా రిస్క్ పెరుగుతుంది.

who will get breast cancer 3 main reasons

చనుమొనల నుండి స్రావాలు కారడం, ముఖ్యంగా రక్తంతో కూడిన స్రావాలు కారడం జరిగినా, చనుమొనను పిండకుండానే ఇలాంటి స్రావాలు కారుతున్నా రొమ్ము క్యాన్సర్ కు సంకేతం. కొన్ని సార్లు వేరే ఇతర కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. కానీ వైద్యుడిని సంప్రదించకుండా దీన్ని లైట్ తీసుకోకూడదు.రొమ్ము మీద ఎరుపు లేదా వాపు వస్తే దాన్ని ఇన్పెక్షన్ అని తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది. కానీ అది ఇన్‌ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణంగా పరిగణిస్తారు. ఈ స్థితిలో రొమ్ము క్యాన్సర్ తీవ్రరూపంలో ఉంటుంది.కొన్ని సార్లు రొమ్ము చర్మం నారింజ తొక్కను పోలి ఉంటుంది. రొమ్ములో కణుతులు ఏర్పడటం వల్ల చర్మంపై ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి.

Sam

Recent Posts