వైద్య విజ్ఞానం

చాలా మందిలో ద‌గ్గుతున్న‌ప్పుడు…మూత్రం ప‌డుతుంది.! దీనిని అధిగ‌మించ‌డం ఎలా….?

చిన్నపిల్లలనే కాకుండా , పెద్దవాళ్లని కూడా దగ్గు, జలుబు బాగా ఇబ్బంది పెడతాయి. ప్రతి మనిషి ఏదో ఒక సంద‌ర్బంలో దగ్గుతూనే ఉంటారు. ఈ దగ్గు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి పొడి దగ్గు వస్తుంటుంది. కొందరికి దగ్గినప్పుడు కఫం పడుతుంది. కొందరికి దగ్గుతుంటే ఛాతి ఎముకలు నొప్పెడతాయి. మరికొందరిలో దగ్గు వలన రాత్రి పూట నిద్ర కూడా ఉండదు. అంతేకాదు కొందరిలో దగ్గేప్పుడు మూత్రం పడుతుంది. ఎందుకు అలా పడుతుంది, దానికి గల కారణాలేంటి….చికిత్సేంటి తెలుసుకుందాం.

దగ్గినప్పుడు ఛాతీలో కలిగే ఒత్తిడి, కడుపులోని ఒత్తిడి మూత్రాశయంపై పడటం వలన దగ్గిన ప్రతిసారీ మూత్రం పడుతుంటుంది. దగ్గినప్పుడు మూత్రం పడటమనే ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వారు దగ్గు రావడానికి కారణమైన వ్యాధి ఏమిటో తెలుసుకుని దానికి చికిత్స తీసుకుంటే, ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ విషయం అర్థం కాని కొంతమంది, మూత్రపిండాలు దెబ్బ తిన్నాయేమోననే భయంతో స్పెషలిస్టుల దగ్గరకు వెళ్లి రకరకాల పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. ఈ విధంగా మూత్రం పడడం వలన బట్టలు తడిసిపోవడం, వాసన రావడం వంటి వాటితో కొందరు బ‌య‌టకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు.

why some people cough while urinate

ఇలా మూత్రం పడేవారిలో మూత్రాశయ సమస్య ఏమీ ఉండకపోవచ్చు.కేవలం కొందరిలోనే కాదు చాలామంది ఈ సమస్యతో కుంగిపోతారు. మీరు గమనించినట్టైతే చిన్నపిల్లలు కూడా దగ్గుతున్నప్పుడు టాయిలెట్ పోసుకుంటారు. అది కూడా ఇలాంటిదే. కాబట్టి దగ్గినప్పుడు మూత్రం పడడాన్ని మూత్రాశయ సమస్య గా కాకుండా దగ్గుకు సరైన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సరైన ఫిజిషియన్‌ను లేదా పల్మొనాలజిస్ట్‌ను సంప్రదించి దగ్గుకు తగిన కారణమేమిటో నిర్ధారణ చేసుకుని తదనుగుణంగా చికిత్స తీసుకుంటే దగ్గినప్పుడు మూత్రం పడే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

Admin

Recent Posts