viral news

చిన్న పిల్లలను స్కూటీ పైన ముందు కూర్చోబెట్టుకుంటున్నారా ? అయితే ఒక్కసారి ఇది చూడండి !

బైక్ అంటే కుర్రాలకు ప్రాణం. ప్రేయసి లేకపోయినా బతుకుతారు. కానీ బైక్ లేకపోతే భరించలేరు. అయితే చేతిలో బైక్, జేబులో పెట్రోల్ కి డబ్బు ఉంటే సరిపోదు. బైక్ నడిపే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే, ఎంతో అనుభవం ఉన్న రేసర్లు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తున్న తప్పుల వల్ల ప్రాణాలే పోతున్నాయి. కారు ప్రమాదం జరిగితే ఎయిర్ బెలూన్స్ కాపాడగలవు. బైక్ ప్రమాదం జరిగితే కాపాడేదెవరు. కాబట్టి, తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.

కానీ కొన్ని కారణాల వల్ల అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అవును.. అలాగే ఓ సంఘటన చోటు చేసుకుంది. స్కూటీ మీద వెళుతున్నప్పుడు మీ పిల్లలను ముందు కూర్చో పెడుతున్నారా? అయితే, జాగ్రత్త, వారిపై ఒక కన్నేసి ఉంచండి. లేకపోతే ప్రమాదాలు తప్పవు. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బాలుడు చేసిన తప్పు తీవ్ర పరిణామానికి దారితీసింది. ఆ బాలుడుతో పాటు తండ్రి కూడా గాయాలపాలయ్యాడు.

do not let your kids sit in front of scooty

ఆ వీడియోలో ఒక వ్యక్తి తన కొడుకుని తీసుకొని ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరాడు. ఇంతలో ఇంట్లో నుంచి అతని భార్య ఏదో వస్తువు తెచ్చి ఇస్తోంది. అప్పటికే స్కూటీ ఆన్ చేసి ఉంది. ఆ సమయంలో స్కూటీ ముందు ఉన్న కుర్రాడు ఒక్కసారిగా యాక్సిలెటర్ ఇచ్చాడు. దాంతో స్కూటీ ముందుకు దూసుకెళ్లింది. కుర్రాడు స్కూటీ తో పాటుపడ్డాడు. ఆ కుర్రాడి తండ్రి వెనక్కి ఎగిరిపడ్డాడు. బండి పైనుంచి పడ్డ తండ్రికి గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Admin

Recent Posts