వైద్య విజ్ఞానం

ముక్కుకు జలుబు చేస్తే.. నాలుకకు రుచి తెలియదు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో ఎక్కువగా తడువడం, వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందికి జలుబు చేస్తుంటుంది. దీని కారణంగా తలనొప్పి, జ్వరానికి దారితీస్తుంది. కనీసం శ్వాస తీసుకోవడం కూడా కష్టమనిపిస్తుంటుంది. వీటిని పక్కన బెడితే ముక్కుకు జలుబు చేస్తే ఏం తిన్నా నాలుకకు రుచి అనిపించదు. వంటకాల రుచి తెలిసే అవకాశం దాదాపుగా తక్కువగా ఉంటుంది.

ముక్కుకు ఇబ్బంది చేస్తే నాలుకెందుకు పని చేయదనే సందేహం చాలామందిలో ఉంటుంది. సందేహం ఉన్నా కారణం తెలియకుండానే దేన్నైనా రుచి చూడమంటే జలుబు చేసింది కదా రుచి తెలియదులే అని బదులిస్తుంటారు. రుచి చివరగా నాలుకతో చూసినా ముందుగా రుచిని తెలియజెప్పేది మాత్రం ముక్కు.

why we lose taste if we get cold

వంటకాలు తయారు చేస్తున్నప్పుడు వచ్చే సువాసనలు పీల్చగానే నోరూరుతుంది. కాబట్టి ముందుగా ముక్కు వాసన గుర్తిస్తేనే నాలుక రుచిని గ్రహిస్తుంది. జలుబు కారణంగా ముక్కు పడకవేస్తే నాలుక రుచిని తెలుసుకునే శక్తిని కోల్పోతుంది.

Admin