mythology

శ్రీ‌కృష్ణున్ని అస‌లు గోవిందుడు అని ఎందుకు పిలుస్తారు..?

శ్రీకృష్ణుడు.. సంపూర్ణ విష్ణు అవతారంగా ప్రసిద్దినొందిన అవతారం. ఆయన లీలలు అనంతం. అయితే ఆయన్ను బాలకృష్ణుడి దగ్గర నుంచి జగత్‌ గురువుగా పిలుస్తారు. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా, తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్థనగిరి తన చిటికెన వేలున ఎత్తి పట్టుకుంటాడు కృష్ణుడు. అది చూసిన ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళతాడు.

అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగా జలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని), కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని పేర్కొంటాడు.

do you know how lord sri krishna got govinda name

అప్పటి నుంచి అలా కృష్ణుడు, గోవిందుడు అన్న నామంతో పూజలందుకున్నాడు. అదండి సంగతి. అయితే గోవిందా అనే పేరు వారహ అవతారంలో కూడా ఉంది. సముద్ర గర్భం నుంచి వేదాలను కాపాడినందుకు గోవిందుడు అనే పేరు మొదట వచ్చింది. గో అంటే వేదాలు అని అర్థం. నారాయణుడికి గోవిందుడు అనేపేరు అత్యంత ప్రీతికరం. కాబట్టే రెండోసారి కూడా ఆ పేరుతో పిలుపించుకుని గోకులంలో గోవిందుడిగా పేరుగాంచాడు.

Admin

Recent Posts