mythology

పుష్ప‌క విమానాన్ని అస‌లు ఎవ‌రు త‌యారు చేశారు..? దాని య‌జ‌మాని అస‌లు ఎవ‌రు తెలుసా..?

సాధారణంగా మనం రామాయణ కథ చదివే ఉంటాం. ఇందులో అనేక కోణాలు ఉంటాయి. ముఖ్యంగా రామాయణంలో రావణుడు పుష్పక విమానాన్ని వాడుతాడ‌ని మనం చదివాం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ రావణుడు ఆ విమానాన్ని ఎలా తయారు చేయించాడు.. నిజానికి అసలు ఆ విమానం రావణుడిది కాదు. బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ ముందుగా ఆ విమానాన్ని తయారుచేసి ఇచ్చాడు.ఆ తర్వాత అది కుబేరుని వద్దకు చేరుతుంది. ఈ క్రమంలోనే కుబేరునితో రావణుడు యుద్ధం చేసి విజయం సాధిస్తాడు.

దీంతో రావణుడు ఆ పుష్పక విమానాన్ని తన వశం చేసుకొని దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇక యుద్ధంలో రావణున్ని రాముడు చంపేశాక ఆ విమానం రావణుడి తమ్ముడు విభీషణుడికి సొంతమవుతుంది. కానీ అతను దాన్ని రాముడికి ఇచ్చేస్తాడు. రాముడు యుద్ధం అనంతరం ఆ పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకుంటాడు.

do you know who created pushpaka vimanam and who is its owner

తర్వాత దాన్ని రాముడు తిరిగి కుబేరుడికి ఇచ్చేస్తాడు. అందువల్ల ఆ విమానం అప్పటినుంచి కుబేరుడు వద్దే ఉంది. అయితే పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కిన ఇంకొకరికి చోటు ఉంటుందని చెబుతారు. దాన్ని అత్యంత విలువైన లోహాలు,రత్నాలు కలగలిపి విశ్వకర్మ తయారు చేశాడు. అందువల్ల పుష్పక విమానం ధర వెలకట్టడం కూడా అసాధ్యమని చెప్పవచ్చు. కానీ రామాయణ కథలో మనకు అనేక చోట్ల పుష్పక విమానం ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది.

Admin

Recent Posts