వినోదం

పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక మాజీ ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

డైనమిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే లైగ‌ర్ త‌రువాత భారీ హిట్ కోసం చూస్తున్న పూరీకి ఈ మూవీ కూడా నిరాశ‌నే మిగిల్చింది. దీంతో ఆయ‌న ర‌వితేజ వైపు చూస్తున్నారు. అయితే ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. అందరికన్నా చిన్న తమ్ముడు సాయి రామ్ శంకర్. ఇతడు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించాడు.

ఇక బయట ప్రపంచానికి తెలియని ఒక తమ్ముడు ఎమ్మెల్యేగా కూడా ప‌నిచేశారు. ఈ విషయం బయట పెద్దగా ఎవరికి తెలియదు. అతడి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్. ఇతడు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గ‌తంలో గెలిచారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక మాజీ ఎమ్మెల్యే అని ఎక్కడ చెప్పుకోకపోవడం విశేషం. ఇక ఉమా శంకర్ గణేష్ మొదట్లో టిడిపి పార్టీలో ఉండేవాడు.

do you know that puri jagannadh brother is an ex mla

1995 నుంచి రాజకీయాల్లో ఉన్న ఉమా శంకర్ గణేష్ 2001 వరకు సర్పంచ్ గా, 2009 నుంచి 12 వరకు తాండవ ఆయకట్టు సంఘానికి చైర్మన్ గా పనిచేశాడు. ఇక ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయి 2019లో మాత్రం మంచి మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. కానీ 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం న‌ర్సీప‌ట్నం నుంచి టీడీపీ విజ‌యం సాధించింది.

Admin

Recent Posts