Lord Sri Krishna : లోకంలో అన్నిటికంటే శక్తివంతమైన జీవులు ఏవి అనే ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇవ్వచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు మనుషులు. అదే ఇంకొందరి అభిప్రాయాన్ని చూసినట్లయితే సింహాలు అని చెప్పొచ్చు. కొంతమంది ఏనుగులు అని కూడా చెప్పొచ్చు. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అయితే ఇవే మీ సమాధానాలు అయితే ఇవేమీ నిజం కాదు లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలు. వృక్షాలు మనకి ఎన్నో లాభాలను ఇస్తూ ఉంటాయి మనం తినడానికి ఫలాలు మొదలు కలప మొదలైనవన్నీ కూడా వృక్షాల ద్వారా మనం పొందవచ్చు.
వృక్షాలు లేకపోతే మనం కూడా ఉండకపోవచ్చు పక్షులకి జంతువులకి నీడని ఇస్తాయి వృక్షాలు మనం జీవించడానికి ప్రాణవాయువుని ఇస్తాయి. ఇలా చెప్పుకుపోతుంటే వృక్షాల యొక్క లాభాలని అలా చెప్తూ ఉండాల్సి ఉంటుంది. వృక్షం కట్టెలుగా పనికొస్తాయి వృక్షాల కంటే గొప్పదైనది వృక్షల తాలూకా వేర్లు. మట్టితో పోరాడుతూ ఉంటాయి. వృక్షాల పండ్లు కలప వంటివి ఇవ్వకపోవచ్చు కానీ వేర్లు లేకపోతే వృక్షం ఉండదు.
అలానే దీపం కూడా సమస్త లోకానికి వెలుగుని ఇస్తుంది చూడడానికి చిన్నదైనా కూడా దీపం ఎంతో వెళ్తుంది అయితే ప్రతి ఒక్కరు కూడా మహానుభావులు అవ్వలేదు. ఏదైనా సాధిస్తే మహానుభావులు అవుతారు చిన్నవాళ్లకైనా పెద్దవాళ్లకైనా లేనివాళ్ళకైనా ఉన్నవాళ్లకైనా ఎవరికైనా కూడా ఏదైనా సాధిస్తేనే విలువ. ఉన్నతులుగా మారచ్చు. కనీసం ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక చోటకి చేరుకుంటారు.
కానీ అలా నిశ్చలంగా కూర్చుంటే దేనిని చేయడానికి కుదరదు. చాలామంది అనుకుంటారు నాకేం తెలుసు? నేనేం మహాత్ముడుని కాదు కదా.. నా వల్ల ఏమవుతుంది అని.. కానీ ఏదైనా మొదలుపెట్టడానికి మహాత్ములు అవ్వక్కర్లేదు. మహాత్ముల అవ్వాలంటే ఏదైనా ప్రారంభించాలి అది చాలా ముఖ్యము. మరి ఎందుకు ఆలస్యం ఈ రోజే మొదలుపెట్టండి. ఉన్నత శిఖరాలకు చేరుకోండి భవిష్యత్తులో చక్కటి గుర్తింపును పొందండి. మహానుభావులు అవ్వండి. నలుగురికి అదర్శంగా నిలవండి.