mythology

యముడి దగ్గర మూడు వరాలు పొందిన ఇత‌ని గురించి మీకు తెలుసా..?

పూర్వం వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో తన వద్ద ఉన్న సిరిసంపదలను దానం చేస్తే మంచి జరుగుతుందని, తన పాపాలు తొలగిపోతాయని ఆ యాగాన్ని సంకల్పించాడు. అయితే ఆ బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ముసలి ఆవులను, పనికిరాని గేదెలను దానం చేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన కుమారుడు నచికేతుడు.. తన తండ్రికి ఎటువంటి పాపం జరగకూడదని, ఆ పాపాల నుండి విముక్తి కలిగించాలని… నేను కూడా నీ సంపదనే కదా నన్ను కూడా దానంచేయమని చెప్పాడు.నచికేతుడు మాటలు విసుగ్గా, చిరాకుగా అనిపించి ఇటు పక్క రావొద్దని కసిరాడు. తన తండ్రి చేస్తున్నది తప్పని.. మళ్ళీ వెళ్లి తనను దానం చేయమని అడిగాడు. ప్రతిసారీ విసిగిస్తున్న నచికేతుడుని యముడి దగ్గరకు వెళ్ళమని కోపంగా అన్నాడు వాజశ్రవుడు. ఇచ్చిన మాట నిలుపుకోకపోతే అసత్య దోషం కలుగుతుందని నన్ను యముడి దగ్గరకు పంపమని కోరతాడు నచికేతుడు.

యాగం తర్వాత తను అన్న మాటలకు ఎంతో కుమిలిపోతాడు నచికేతుడి తండ్రి. యముడి వద్దకు వెళతాడు నచికేతుడు. అదే సమయంలో యముడు వేరే కార్యనిమిత్తం ఎక్కడికో వెళ్లిఉంటాడు. మూడు రోజులు గడిచినా యముడు రాలేదు. ఆహారం తీసుకోకుండా మూడు రోజులపాటు అలానే ఉన్నాడు. అయితే తన కోసం వచ్చిన అతిథిని ఇలా ఇన్ని రోజులు ఎదురుచూసేలా చేశానని, దానికి ప్రాయశ్చితంగా మూడు వరాలు కోరుకోమని నచికేతుడికి చెబుతాడు యముడు. నచికేతుడు వరాలు ఇలా ఉన్నాయి. మీ దగ్గర నుండి మళ్ళీ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళగానే నా తండ్రి ఎటువంటి అనుమానం కలగకుండా ఇంట్లోకి ఆహ్వానించాలి. అలాగే మా తండ్రి చేసిన పాపాలు తొలగిపోవాలి. యమధర్మరాజు:సరే అని బదులిచ్చాడు.

who blessed with 3 boons from lord yama

స్వర్గప్రాప్తి పొందడానికి ఎలాంటి యాగం చేయాలి. ఎలా చేయాలో చూపించమని కోరాడు. య‌ముడు అది కూడా చెప్పాడు. ఈ యాగానికి నాచికేత యాగం అనే పేరు వస్తుందని యముడు బదులిచ్చాడు. మరణం తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుంది, ఏమవుతుంది, బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమన్నాడు. అది రహస్య విషయం కావడంతో యముడు చెప్పడానికి నిరాకరించాడు. చెప్పడం ఇష్టంలేని యముడు కానుకలు ఇస్తానని చెప్పాడు. అయితే నచికేతుడు ఆ నిజం తెలుసుకోవాలని కోరడంతో యముడు బ్రహ్మజ్ఞానం గురించి ఉపదేశించాడు. అలా యముడి నుండి బాల్యంలోనే మూడు గొప్ప వరాలు పొంది, తన తండ్రి పాపాలను తొలగించాడు. యముడి వద్ద నుండి ఇంటికి వచ్చిన అత‌న్ని సాదరంగా ఆహ్వానించాడు నచికేతుడు తండ్రి వాజశ్రవుడు.

Admin

Recent Posts