5 Best Mosquito Repellents : ప్రస్తుత వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుందని చెప్పవచ్చు. దోమల ద్వారా వ్యాపించే ఈ డెంగ్యూ జ్వరాల కారణంగా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. కేవలం డెంగ్యూ జ్వరాలు మాత్రమే కాకుండా దోమల కారణంగా మలేరియా, బోధకాలు వంటి వాటి బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విష జ్వరాల కారణంగా కలిగే అస్వస్థత అంతా ఇంతా కాదు. కనుక మనల్ని మనం దోమకాటుకు గురికాకుండా కాపాడుకోవాలి. కొన్ని రకాల చర్యలను పాటించడం వల్ల మనల్ని మనం దోమల నుండి కాపాడుకోవచ్చు. ఇంట్లో ఉండే దోమలను నశింపజేయడంలో మనకు బజ్ బి గాన్ ట్రాప్ ఎంతగానో సహాయపడుతుంది. ఇది మనకు ఆన్ లైన్ లో ఎక్కువగా లభిస్తుంది. ఈ ట్రాప్ ని మనం ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు దీని వల్ల ఎటువంటి హాని కలగదు. ఎటువంటి శబ్దం ఉండదు.
కరెంట్ తో నడిచే ఈ ట్రాప్ లో యువి ఎల్ఇడి లైట్ ఉంటుంది. అలాగే దోమల ట్రాప్ ఉంటుంది. ఈ లైట్ కారణంగా దోమలు ఆకర్షించబడి లోపలికి వెళ్లగానే నశిస్తాయి. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దోమలతో పాటు ఇతర కీటకాలు కూడా నశిస్తాయి. దోమలను నివారించడంలో ఇది ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు. అలాగే బయటకు వెళ్లేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు మస్కిటో రిప్లెంట్ బాడీ స్ప్రేలను వాడడం మంచిది. నిమ్మనూనె, యూకలిప్టస్, లెమన్ గ్రాస్ వంటి వాటితో చేసే ఈ స్ప్రేలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి ఎటువంటి హానిని కలిగించవు. ఈ వాసన కారణంగా దోమలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇవి గరిష్టంగా 6 గంటల వరకు పని చేస్తాయి.
కనుక దో మల నుండి మనల్ని మనం కాపాడుకోవడంలో ఇది ఎంతగానో సహాయపడతాయి. అలాగే డీట్ మస్కిటో రెప్లెంట్ స్ప్రేను వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిని చర్మంపై లేదా బట్టలపైఎక్కడైనా స్ప్రే చేసుకోవచ్చు. బయటకు వెళ్లినప్పుడు దీనిని చర్మంపై లేదా బట్టలపై స్ప్రే చేసుకుని వెళ్లడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది దాదాపు 8 గంటల వరకు మనల్ని దోమ కాటుకు గురి కాకుండా కాపాడుతుంది. ఇక సాయర్ ఇన్సెక్ట్ రిపెల్లెంట్ స్ప్రేను వాడడం వల్ల కూడా మనం దోమ కాటుకు గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఇది లోషన్ మరియు స్ప్రే రూపంలో లభిస్తుంది. ఇది 12 నుండి 14 గంటల పాటు పని చేస్తుంది.
దీనిని బట్టలపై లేదా చర్మంపై నేరుగా స్ప్రే చేసుకోవచ్చు. వీటి వాసన కారణంగా దోమలు మన దగ్గరకు రాకుండా ఉంటాయి. సాధారణంగా దోమలు మన శ్వాసలో ఉండే కార్బన్ డై యాక్సైడ్ కారణంగా ఆకర్షించబడి మనల్ని కుడతాయి. ఇలా మనం స్ప్రేలను వాడడం వల్ల దోమలు మన దగ్గరి నుండి వచ్చే వాసన కారణంగా ఆకర్షనకు గురి కాకుండా ఉంటాయి. బయట లభించే వాటిని ఉపయోగించడం ఇష్టంలేని వారు సుగంధ నూనెలను, ఘాటైన వాసన ఉండే మొక్క సారాలతో స్ప్రేను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. ఈ స్ప్రేలన్నీ కూడా మనకు ఆన్ లైన్ లో సులభంగా లభిస్తాయి. వీటిని వాడడం వల్ల మనల్ని మనం దోమల కారణంగా వచ్చే విష జ్వరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.