Airtel Credit Card : ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అద్భుతమైన ఆఫర్లను కలిగి ఉండే ఓ సరికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఇందుకు గాను ఎయిర్‌టెల్ సంస్థ యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలోనే ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సంయుక్తంగా లాంచ్ చేశారు. ఈ క్రెడిట్ కార్డు కేవలం ఎయిర్‌టెల్ వినియోగదారులకు మాత్రమే లభిస్తుంది.
ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్‌లు లాంచ్ చేసిన ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు పొందాలనుకునే వారు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో దీని కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ కార్డు ద్వారా అనేక ఆఫర్లను, డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను, రివార్డులను పొందవచ్చు.
ఈ కార్డుతో ఎయిర్‌టెల్ మొబైల్ లేదా డీటీహెచ్ రీచార్జిలను చేసినా లేదా ఎయిర్ టెల్ బ్లాక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ పేమెంట్లు చేసినా.. 25 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే విద్యుత్, గ్యాస్, వాటర్ బిల్లులను ఈ కార్డుతో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో చెల్లిస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటో యాప్ లలో ఈ కార్డును వాడితే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఇతర అన్ని ఖర్చులపై 1 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డును పొందిన తరువాత యాక్టివేట్ చేసుకుని 30 రోజుల్లోగా దేనికైనా వాడితే అప్పుడు రూ.500 విలువైన అమెజాన్ ఇ-వోచర్ ను ఇస్తారు. ఇక ఈ కార్డు ద్వారా యాక్సిస్‌బ్యాంకు ఎయిర్ టెల్ సేవలను కూడా వినియోగించుకుంటుంది.