Akhil Agent Movie : యంగ్ హీరో అక్కినేని అఖిల్ స్పై యాక్షన్ థ్రిలర్‌తో రానున్నాడు. ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. మళయాలం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
ఏజెంట్ సినిమాలో జాతీయవాద అంశాలు ఉన్నందున స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో అఖిల్ చాలా వైల్డ్ గా చేతిలో మెషిన్ గన్ పట్టుకొని ఉన్నాడు. ఇందులో కొంత మంది ఆఫీసర్‌లని కూడా మనం గమనించవచ్చు. అఖిల్ ఒక యాక్షన్ సినిమాతో మన ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం అంటే టెక్నికల్ అంశాలకు పెద్ద పీట వేస్తారు. అలాగే యాక్షన్ కూడా బాగా ఉంటుంది. కనుక ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుందని.. అఖిల్ యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడని పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది. కాగా ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.