Flipkart : ఫ్లిప్‌కార్ట్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.16వేల ఫోన్ రూ.3వేల‌కే..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వినియోగ‌దారుల‌కు అద్భుతమైన బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. రూ.16వేల విలువైన స్మార్ట్ ఫోన్‌ను కేవ‌లం రూ.3వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. హోలీ పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక సేల్‌లో వినియోగ‌దారుల‌కు ఈ ఆఫ‌ర్ ల‌భ్యం కానుంది. ఈ క్ర‌మంలోనే భారీ డిస్కౌంట్ ధ‌ర‌కు ఆ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఆ ఫోన్‌, ఆఫ‌ర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Flipkart huge discount offer smart phone for rs 3000 only
Flipkart

హోలీ పండుగ సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 12 నుంచి 16వ తేదీ వ‌ర‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా రియ‌ల్‌మి 8 స్మార్ట్ ఫోన్‌ను రూ.3వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.16,099 ఉంది. అయితే దీనిపై ప‌లు ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ ధ‌ర భారీగా త‌గ్గ‌నుంది.

ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. దీంతో ఫోన్ ధ‌ర రూ.1000 త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో ఫోన్ ధ‌ర రూ.15,099 అవుతుంది. అలాగే మీ ద‌గ్గ‌ర ఉన్న పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.13వేల వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. దీంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆఫ‌ర్ల‌ను పొందితే.. అప్పుడు ఈ ఫోన్ రూ.3వేల‌కే ల‌భిస్తుంది. ఇలా ఈ సేల్‌లో ఈ ఫోన్‌ను చాలా తగ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇలాంటి మ‌రెన్నో ఆఫ‌ర్ల‌ను ఈ సేల్‌లో అందిస్తున్నారు.

Editor

Recent Posts