Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసిన విషయం విదితమే. అయితే ఆమె ఎల్లప్పుడూ అందులో యాక్టివ్‌గా ఉంటుంది. ఇలా ఉన్న పళంగా ఆమె ఆ అకౌంట్‌ను డిలీట్ చేయడం సంచలనంగా మారింది. అయితే దీని వెనుక ఓ బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అత్తింటి వారు ఓ వీడియో విషయంలో ఆమెకు వార్నింగ్ ఇచ్చారట. అందుకనే ఆమె ఆ వీడియోను కాకుండా పూర్తిగా అకౌంట్‌నే డిలీట్ చేసిందని అంటున్నారు.
కొణిదెల నిహారికకు 2020 డిసెంబర్ 9వ తేదీన చైతన్య అనే వ్యక్తితో వివాహం అయింది. అతను పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు. వీరి వివాహాన్ని అత్యంత వైభవంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరిపించారు. అయితే వీరి దాంపత్యం అన్యోన్యంగానే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నిహారిక తనకు పుట్టింటి కన్నా అత్తింటి వారింట్లోనే ఎక్కువ స్వేచ్ఛ ఉందని.. తాను తన ఇంట్లో అయితే అమ్మ నిద్ర త్వరగా లేపుతుందని.. కానీ తన అత్తయ్య ఉదయం తమ బెడ్ రూమ్ వద్దకు రాదని.. చెప్పుకొచ్చింది. అయితే అంతటి ఫ్రీడమ్ ఇచ్చినా నిహారిక దాన్ని సద్వినియోగం చేసుకోలేదని తెలుస్తోంది.
నిహారిక తన జిమ్ ట్రైనర్ వీపు మీద కూర్చుని ఉండగా.. అతను పుషప్స్ చేశాడు. దీంతో ఆ వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. అయితే దీనిపైనే నిహారికకు అత్తింటి వారు క్లాస్ పీకారట. దీంతో మనస్థాపం చెందిన నిహారిక ఆ వీడియోను కాకుండా పూర్తిగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? అనే విషయం తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది.