Allu Arjun : బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప సినిమాతోనూ అల్లు అర్జున్ అలాంటి స్టేటస్‌నే పొందాడు. హిందీ మార్కెట్‌లో పుష్ప సూపర్ డూపర్ హిట్ కావడం అల్లు అర్జున్‌కు కలిసొచ్చింది. దీంతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని సహజంగానే పుష్ప మేకర్స్ సెకండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్, సుకుమార్‌ల రెమ్యునరేషన్‌ను భారీగా పెంచారు. కానీ అల్లు అర్జున్ తనకు రెమ్యునరేషన్ వద్దని.. ప్రతిగా ఇంకోటి కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప 2 మూవీకి గాను హిందీ హక్కులను తనకు పూర్తిగా ఇచ్చేయాలని అల్లు అర్జున్ డిమాండ్ చేస్తున్నాడట. ఇది ఆయనకు సెకండ్ పార్ట్ కోసం అందించాలనుకున్న రెమ్యునరేషన్ కన్నా చాలా ఎక్కువే. కనుకనే ఈ విషయంలో మేకర్స్‌కు, అల్లు అర్జున్‌కు చర్చలు నడుస్తున్నాయట. తనకు సెకండ్ పార్ట్ మూవీ హిందీ హక్కులను మొత్తం ఇచ్చేయాలని.. ఇంకే రెమ్యునరేషన్ వద్దని అల్లు అర్జున్ అంటున్నాడట. ఈ క్రమంలో ఆ హక్కులు లభిస్తే తన తండ్రి అల్లు అరవింద్ హిందీలో మొత్తం ఆ సినిమాను చూసుకుంటారు. కనుకనే పుష్ప 2 హిందీ హక్కులను తనకు పూర్తిగా ఇచ్చేయాలని అల్లు అర్జున్ కోరుతున్నాడట. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.
ఇక ఈ విషయం వల్లనే పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కావల్సి ఉంది. సుకుమార్ అంతా రెడీ చేశారు. కానీ అల్లు అర్జున్ రెమ్యునరేషన్, హిందీ హక్కుల కేటాయింపు వంటి విషయాలపై ఇంకా చర్చలు సాగుతున్నాయి కనుకనే షూటింగ్ ఆలస్యం అవుతుందని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ నెల నుంచి సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
ఇక మొదటి పార్ట్‌కు అల్లు అర్జున్ రూ.45 కోట్లు తీసుకున్నాడని.. కానీ ఈసారి మాత్రం హిందీ హక్కులు కావాలని అంటున్నాడని తెలుస్తోంది. మరి దీనిపై మేకర్స్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి. కాగా రెండో పార్ట్‌లోనూ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.