Aloo Bendakaya Masala Vepudu : ఆలు, బెండ‌కాయ మ‌సాలా వేపుడును ఇలా చేయండి.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంది..!

Aloo Bendakaya Masala Vepudu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఇతర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు, వేపుళ్లు త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ బెండ‌కాయ వేపుడు క‌డా ఒక‌టి. బంగాళాదుంప‌లు, బెండ‌కాయ‌లు క‌లిపి చేసే ఈ మ‌సాలా వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఈ వేపుడు చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ బెండ‌కాయ మ‌సాలా వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బెండ‌కాయ మ‌సాలా వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బెండ‌కాయ‌లు – పావుకిలో, త‌రిగిన బంగాళాదుంప‌లు – పెద్ద‌వి రెండు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 8, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి -అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Bendakaya Masala Vepudu recipe in telugu very tasty
Aloo Bendakaya Masala Vepudu

ఆలూ బెండ‌కాయ మ‌సాలా వేపుడు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు,కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్క‌లు, బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత మూత పెట్టి వేయించాలి. బంగాళాదుంప ముక్క‌లు రంగు మారిన త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి పూర్తిగా వేయించాలి. బంగాళాదుంప ముక్క‌లు, బెండ‌కాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బెండకాయ మ‌సాలా వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts