Minappappu Tomato Pachadi : వేడి అన్నంలోకి కారంగా ఎంతో రుచిగా ఉండే పాతకాలం కమ్మటి మినపప్పు పచ్చడి

Minappappu Tomato Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాటాల‌తో చాలా సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్ల‌ల్లో మిన‌ప‌ప్పు ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప‌చ్చ‌డిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా, చాలా రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే మిన‌ప‌ప్పు ట‌మాట ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మిన‌ప‌ప్పు ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, మిన‌ప‌ప్పు – అర క‌ప్పు, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌కర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 15, త‌రిగిన ట‌మాటాలు – 3, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ఉప్పు – త‌గినంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, క‌రివేపాకు -ఒక రెమ్మ‌.

Minappappu Tomato Pachadi recipe in telugu make in this method Minappappu Tomato Pachadi recipe in telugu make in this method
Minappappu Tomato Pachadi

మిన‌ప‌ప్పు ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మిన‌ప‌ప్పు వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించాలి. మిన‌ప‌ప్పు రంగు మారిన త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా చ‌క్క‌గా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే అదే క‌ళాయిలో ట‌మాట ముక్క‌లు, చింత‌పండు, ఉప్పు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి.

త‌రువాత జార్ లో ముందుగా వేయించిన మిన‌ప‌ప్పును తీసుకోవాలి. దీనిని బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత ఉడికించిన ట‌మాటాలు, కొద్దిగా నీళ్లు పోసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో క‌మ్మ‌గా ఉండే మిన‌ప‌ప్పు ట‌మాట ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts