Aloo Bonda : సాయంత్రం స‌మ‌యంలో వీటిని చేసుకుని తినండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Aloo Bonda : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ బోండా కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు బ‌య‌ట బండ్ల మీద, హోట‌ల్స్ లో ల‌భిస్తూ ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ బోండాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ బోండాల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 200 గ్రా., చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పిండి – 100 గ్రా., వంట‌సోడా – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Aloo Bonda recipe in telugu very tasty snacks
Aloo Bonda

ఆలూ బోండా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, చిటికెడు ప‌సుపు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని బ‌జ్జీ పిండిని క‌లుపుకున్న‌ట్టు క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చ వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను మెత్త‌గా చేసుకుని వేసుకోవాలి. త‌రువాత ఉప్పును, ప‌సుపును, గ‌రం మ‌సాలాను వేసి మ‌సాలా అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఈ ఆలూ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఒక్కో ఉండ‌ను తీసుకుని ముందుగా క‌లిపి పెట్టుకున్న శ‌న‌గ‌పిండి మిశ్ర‌మంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బోండా త‌యార‌వుతుంది. సాయంత్రం స‌మ‌యాల్లో అప్పుడ‌ప్పుడు ఇలా బంగాళాదుంప‌ల‌తో బోండాల‌ను త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. వ‌ద్ద‌న‌కుండా ఈ బోండాల‌ను ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts