Aloo Carrot Fry : ఆలు, క్యారెట్‌ల‌ను క‌లిపి ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Aloo Carrot Fry : మ‌నం క్యారెట్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్ జ్యూస్ తాగ‌డంతో పాటు క్యారెట్ ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ క్యారెట్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సులువుగ తయారు చేసుకోవ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఆలూ క్యారెట్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ క్యారెట్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – పావు కిలో, గుండ్ర‌టి ముక్క‌లుగా త‌రిగి ఉడికించిన క్యారెట్ – 200 గ్రా., పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ల‌వంగాలు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్.

Aloo Carrot Fry recipe in telugu make in this way
Aloo Carrot Fry

ఆలూ క్యారెట్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ల‌వంగాలను, దాల్చిన చెక్క‌ను పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత క్యారెట్ ముక్క‌లు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను కొద్దిగా మెత్త‌గా చేసుకుంటూ క‌లుపుకోవాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి.

ఇలా వేయించిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యారెట్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్, ఆలూతో ఫ్రైను త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts