Aloo Fry : ఆలు ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. టేస్ట్ చూస్తే అదుర్స్ అంటారు..

Aloo Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటు ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒక‌టి. బంగాళాదుంప వేపుడును చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వేపుడును వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా కారం పొడి వేసి చేసే బంగాళాదుంప వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కారం పొడి వేసి ఈ బంగాళాదుంప వేపుడును మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప‌లు – అర‌కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్స్, జీల‌కర్ర – పావు టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Aloo Fry recipe in telugu very tasty how to cook it
Aloo Fry

కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 6 లేదా త‌గిన‌న్ని, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 4.

ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు వేగిన త‌రువాత నువ్వులు, వెల్లుల్లి రెబ్బ‌లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత నువ్వుల‌ను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసుల‌న్నీ చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని క‌లుపుతూ మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌రలాడే వ‌ర‌కు వేయించుకోవాలి. బంగాళాదుంప ముక్క‌లు వేగిన త‌రువాత వాటిని ఒక ప‌క్క‌కు అనుకుని ఆ త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అన్నీ క‌లిసేలా క‌లుపుకోవాలి.

త‌రువాత ప‌సుపు, ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న కారం పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో పాటు ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో కూడా క‌లిపి తిన‌వ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ ఫ్రైను అంద‌రూ ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే బంగాళాదుంప వేపుడుతో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts