Aloo Tomato Masala Curry : ఆలు ట‌మాటా మ‌సాలా క‌ర్రీని ఇలా చేస్తే.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది..!

Aloo Tomato Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ఆలూ ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో జ‌రిగే ప్ర‌తి ఫంక్ష‌న్స్ లోను ఈ కర్రీ ఉంటుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఆలూ ట‌మాట క‌ర్రీని మ‌ప‌లా వేసి మ‌నం మరింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఈ ఆలూ ట‌మాట మ‌సాలా కర్రీ బ‌గారా అన్నం, పులావ్, రోటీ, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. మ‌రింత రుచిగా ఈ ఆలూ ట‌మాట మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ట‌మాట మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన ట‌మాటాలు – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌కర్ర -అర టీ స్పూన్, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు -2, యాల‌కులు – 2, బిర్యానీ ఆకు – 1, ఎండుమిర్చి – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, పుదీనా ఆకులు – 10, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 4, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒకటింపావు గ్లాస్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Tomato Masala Curry recipe in telugu you can take it
Aloo Tomato Masala Curry

ఆలూ ట‌మాట మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, మసాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత క‌రివేపాకు, పుదీనా వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ టమాట ముక్క‌ల‌ను మెత్త‌గా ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ఉప్పు,కారం, ధ‌నియాల పొడి, క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి.

అయితే వీటిని మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా ముక్క‌లు ఉండేలా చూసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 7 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ట‌మాట మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. ఈ కూర‌ను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts