Seema Pappu : సీమ ప‌ప్పు.. అన్నంలో వెల్లుల్లి కారం, నెయ్యితో తింటే.. రుచి అదుర్స్‌..

Seema Pappu : వంట‌ల్లో వాడ‌డంతో పాటు ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా రాయ‌ల‌సీమలో త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ప‌ప్పును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ప‌చ్చిమిర్చి ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌చ్చిమిర్చి ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – రెండున్న‌ర క‌ప్పులు, త‌రిగిన ట‌మాటాలు – 5( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 10 లేదా కారానికి త‌గిన‌న్ని, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ప‌సుపు -అర టీ స్పూన్.

Seema Pappu recipe in telugu very easy and tasty
Seema Pappu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, పొడవుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు -ఒక రెమ్మ‌.

ప‌చ్చిమిర్చి పప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత నీళ్లతో పాటు మిగిలిన ప‌దార్థాలన్నింటిని వేసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ప‌ప్పును వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చిమిర్చి ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యి, వెల్లుల్లి కారంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts