Anasuya Bharadwaj : ఓ వైపు బుల్లి తెరపై తనదైన శైలిలో అలరిస్తూనే మరో వైపు వెండితెరపై కూడా అనసూయ సత్తా చాటుతోంది. వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఓ విభిన్నమైన వస్త్రధారణలో కనిపించి నెటిజన్లకు షాకిచ్చింది. అనసూయ అలాంటి డ్రెస్‌లో దర్శనమిచ్చే సరికి నెటిజన్లకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇక ఆమె తాజాగా మరోమారు వార్తల్లో నిలిచింది.
పలు వెబ్ సైట్లలో అనసూయ తనపై వస్తున్న వార్తలను చదివి స్పందించింది. కొన్ని సైట్లలో తన వయస్సు 40 కి పైగానే ఉంటుందని కథనాలను ప్రచురిస్తున్నారని.. అయితే తన వయస్సు 36 ఏళ్లు అని.. తాను తన వయస్సు చెప్పేందుకు ఎలాంటి సందేహం చెందనని.. ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని.. ఏదీ దాచుకోనని.. అనసూయ తెలియజేసింది.
జర్నలిజం చాలా శక్తివంతమైందని, దాన్ని ఇలా తప్పుగా వాడుకోవద్దని.. విలువలు, నైతికత పాటించాలని.. అనసూయ కోరింది. తప్పుడు వార్తలను రాయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ మాత్రమే కాదు, అసలు అమ్మాయిలు ఎవరూ తమ వయస్సు చెప్పరు. కానీ అనసూయ ఈ విషయంలో సాహసం చేసిందనే చెప్పవచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయ ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించగా.. మొన్నీ మధ్యే రిలీజ్ అయిన ఖిలాడి మూవీలోనూ కీలకపాత్రలో ఆకట్టుకుంది. ఇక ఈమె త్వరలో పుష్ప 2 షూటింగ్‌లోనూ పాల్గొననుంది.