Mahesh Babu : క‌ళావతి సాంగ్‌ మేకింగ్ వీడియో.. చూడాల్సిందేనబ్బా..!

Mahesh Babu : మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా మే12న విడుద‌ల కానుండ‌గా, ఇటీవ‌ల ఈ సినిమా నుండి క‌ళావ‌తి సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈ పాట మాములు హిట్ కాలేదు. రిలీజైన ఒక్కరోజే ఈ సాంగ్ దాదాపుగా 16 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడికెళ్లినా ఈ మ్యూజిక్ మారుమోగుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ సాంగ్ ప్రేమికులు, మ్యూజిక్ లవర్స్ కూడా బాగా నచ్చింది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా కూడా క‌ళావ‌తి హంగామానే న‌డుస్తోంది. ఈ సాంగ్ ఇంత పెద్ద సక్సెస్ కావడంతో సంగీత దర్శకుడు థమన్ కూడా ఒకింత ఎమోషనల్ అవుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్, లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి మెలొడీ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది. క‌ళావ‌తి పాట 24 గంట‌ల్లో 16 మిలియ‌న్ల వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాట‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక 24 గంట‌ల్లో ఈ పాటకు 806K లైక్స్ రావ‌డం విశేషం. ఇక ఇప్పుడు ఈ పాట 20 మిలియన్ వ్యూస్ దాటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Mahesh Babu  kalaavathi song making video released
Mahesh Babu

తాజాగా కళావతి సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, మహేష్, డైరెక్టర్ పరశురామ్ ఫన్నీగా గడిపినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మ‌హేష్ తెగ న‌వ్వుతూ షూటింగ్ ఎంజాయ్ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే సినిమా మొత్తం చాలా ఫన్నీగా సాగిన‌ట్టు తెలుస్తుంది.

Editor

Recent Posts