Blood Thinning Foods : సాధారణంగా ఎవరికైనా సరే కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ నియంత్రణలో ఉంటే హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే రక్తాన్ని పలుచగా చేయడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. రక్తం చిక్కగా ఉన్నప్పుడు రక్తంలోని ప్లేట్‌లెట్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్రోటీన్స్ కలిసి రక్తం గడ్డ కట్టేలా చేస్తాయి. దీంతో రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు వస్తాయి. అయితే రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉండాలన్నా.. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవాలన్నా.. అందుకు కొన్ని ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..
1. బీట్‌రూట్‌లలో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను సంరక్షించడంతోపాటు రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి. బీట్‌రూట్ జ్యూస్ తాగిన మూడు గంటల్లోనే మన శరీరంలో నైట్రేట్ లెవల్స్ పెరుగుతాయి. బీపీని నియంత్రించడంలో బీట్‌రూట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు.
2. రెడ్ వైన్ రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది. రెడ్ వైన్‌లో ఉండే ట్రాన్స్ రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ వంటి మూలకాలు రక్తాన్ని పలుచగా చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. టమాటాలను నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల వాటిలో ఉండే క్లోరోజెనిక్, ఫెర్యులిక్ వంటి మూలకాలు రక్తంలోని ప్లేట్‌లెట్స్ గడ్డ కట్టకుండా నిరోధిస్తాయి. దీంతో రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. హార్ట్ ఎటాక్‌లు రావు.
4. డార్క్ చాకొలెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తాన్ని పలుచగా చేయడంలో ఉపయోగపడతాయి. వైట్, మిల్క్ చాక్లెట్ తినే వారి కంటే డార్క్ చాక్లెట్ తినే వారిలో రక్తం పలుచగా ఉంటుంది. వైట్, మిల్క్ చాక్లెట్ లలో కోకోవా తక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లలో కోకోవా ఎక్కువగా ఉండడం వలన అది రక్తం గడ్డ కట్టకుండా పలుచగా చేస్తుంది. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
5. చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటికి సహజంగానే రక్తాన్ని పలుచగా చేసే లక్షణం ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ ల నుండి గుండెను కాపాడుకోవచ్చు.
6. ఉల్లిగడ్డలలో సల్ఫర్ తోపాటు అడెనోసిస్, అల్లిసిన్, పారాఫినిక్ పాలీసల్పైడ్స్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేసి గుండెను సంరక్షిచడంతోపాటు బీపీని నియంత్రిస్తాయి.
7. ద్రాక్ష పండ్లల్లో క్వెర్సెటిన్, మైరిసెటిన్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. రోజూ ఉదయం ఒక గ్లాసు ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
8. రక్తం గడ్డ కట్టకుండా నియంత్రించడంలో అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లేట్‌లెట్స్ స్థాయిని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించి గుండెను సంరక్షిస్తుంది.
9. విటమిన్ ఇ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నా రక్తం గడ్డ కట్టకుండా పలుచగా ఉంటుంది. విటమిన్ ఇ మనకు రక్తాన్ని పలుచగా చేసే పదార్థంగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ.. పాలకూర, నట్స్ వంటి వాటిల్లో ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల వీటిని తీసుకుంటే రక్తం పలుచగా ఉంటుంది. దీంతో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.