వినోదం

Anushka Shetty : అనుష్క ఆస్తుల విలువ తెలిస్తే కళ్ళు తిరుగుతాయి.. ఇప్పటివరకు అనుష్క ఎంత ఆస్తి వెనకేసిందో తెలుసా..?

Anushka Shetty : నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క కేవలం ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. తన కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు ఆమె స్థాయిని మరింత పెంచాయి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అనుష్క పేరు మారు మోగిపోయింది.

మొదట్లో అనుష్క పారితోషికం లక్షల్లో ఉండేది. అయితే అద్భుతమైన కథాంశం తో వచ్చిన అరుంధతి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో తన రెమ్యునరేషన్ ను అనూహ్యంగా కోటికి పెంచేసింది. అప్పట్లో అదే చాలా ఎక్కువ. ఆ తర్వాత మిర్చి, ఢమరుకం, బాహుబలి తర్వాత అనుష్క తన రెమ్యునరేషన్ నాలుగు కోట్ల వరకూ పెంచేసింది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అనేక చిత్రాల్లో నటించింది. దాదాపు 47 చిత్రాలలో కనిపించిన అనుష్క అత్యధిక పారితోషికం పొందే దక్షిణ భారత నటీమణులలో ఒకరు.

anushka shetty assets and properties value

మరి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుష్క ఆస్తులు విలువ ఎంత అంటూ సోషల్ మీడియాలో చర్చి మొదలైంది. అరుంధతి తర్వాత అనేక చిత్రాల్లో నటించిన అనుష్క భారీ మొత్తంలో పారితోషకం అందుకుంటూ చాలా ఆస్తులు సంపాదించింది. అనుష్క ఆస్థి దాదాపు 250కోట్లు ఉంటుందని సినీ వర్గాల్లో అంచనా. నగదు రూపంలో అసలు తన దగ్గర ఏమీ ఉంచుకోడానికి ఇష్టపడని స్వీటీ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాస్తోందట. ఇక బెంగళూరులో విలాసవంతమైన భవంతులు, ఫామ్ హౌస్ లు అనుష్క పేరిట ఉన్నాయని సమాచారం.

అంతేకాదు బాహుబలి తర్వాత హైదరాబాద్ లో కొన్ని నివాస స్థలాలు కొన్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ప్రస్తుత మార్కెట్ వేల్యూ ప్రకారం ఆ స్థలాల ధర వందకోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఆమె వద్ద గోల్డ్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా. అనుష్క దగ్గర ఉన్న బెంజ్ కారు, బిఎం డబ్య్లు కారు ఖరీదు కోటికి పైనే విలువ ఉంటుందని తెలుస్తోంది.

Admin

Recent Posts