lifestyle

Ghee Purity : మీరు వాడుతున్న నెయ్యి స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. క‌ల్తీ అయిన‌దా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Ghee Purity : మనము రెగ్యులర్ గా, నెయ్యిని వాడుతూ ఉంటాము. వంటల్లో నెయ్యిని వేసుకుంటూ ఉంటాము. అలానే, ఏమైనా స్వీట్లు వంటివి తయారు చేయడానికి కూడా, నెయ్యిని ఎక్కువగా వాడుతుంటాము. మార్కెట్లో నెయ్యికి డిమాండ్ బాగానే ఉంది. రకరకాల కంపెనీల నెయ్యి మార్కెట్ లో మనకు దొరుకుతూ ఉంటుంది. కానీ, కొన్ని కొన్ని కంపెనీలు నెయ్యి స్వచ్ఛమైనవి కావు. ఈ మధ్యకాలంలో ఆహారం విషయంలో, రకరకాలుగా కల్తీ చేసి మోసం చేస్తున్నారు. మనం ఉపయోగించిన నెయ్యి కల్తీదా..? లేదంటే స్వచ్ఛమైనదా అనేది ఎలా తెలుసుకోవాలి..? ఈ విషయం గురించి ఈరోజు చూద్దాం.

ఈసారి నెయ్యిని వాడే ముందు, ఈ టెస్ట్ చేసి, నెయ్యి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకుని, ఆ తర్వాత మాత్రమే ఉపయోగించండి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఈ, విటమిన్ ఏ తో పాటుగా విటమిన్ డి కూడా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. నెయ్యిని తీసుకుంటే, ఎనర్జీ కూడా బాగా పెరుగుతుంది.

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా, ఇతర పోషకాలు ఉంటాయి. నెయ్యిని తీసుకోవడం వలన, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎప్పుడైనా మనం నెయ్యిని కాచినట్లయితే, నెయ్యి నుండి మంచి సువాసన వస్తుంది. అప్పుడు, అది స్వచ్ఛమైన నెయ్యి అని మనం కనిపెట్టొచ్చు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి రంగు గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఒకవేళ కనుక, అలా లేనట్లయితే కచ్చితంగా అది నకిలీ నెయ్యి అని మీరు కనిపెట్టొచ్చు.

how to identify ghee is pure or not

నెయ్యి కొంచెం స్మూత్ గా క్రీమీ టెక్స్చర్ తో ఉంటుంది. రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఫ్రిజ్లో పెట్టినప్పుడు, కొంచెం గట్టి పడుతుంది. వేడి చేస్తే, కరిగిపోతుంది. ఒకవేళ కనుక స్టిక్కీగా ఉన్నట్లయితే, కల్తీ చేసినట్లు మీరు తెలుసుకోవచ్చు. నెయ్యిని కరిగించినప్పుడు, చాలా క్లియర్ గా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా స్వచ్ఛమైన నెయ్యి.

ఒక టీ స్పూన్ నెయ్యి పాన్ లో వేసి, వేడి చేసినట్లయితే త్వరగా అది కరిగిపోయినట్లయితే, అది స్వచ్ఛమైన నెయ్యి అని మనం తెలుసుకోవచ్చు. అలానే సువాసన కూడా బాగుంటుంది. అదే కల్తీ చేసిన నెయ్యి వాసన మాత్రం బాగోదు. నెయ్యిని ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు, గట్టిపడుతుంది. ఒకవేళ గట్టిపడకుండా లిక్విడ్ గానే ఉండిపోయినట్లైతే, దాన్ని కల్తీ చేశారని తెలుసుకోవచ్చు. మంచి కంపెనీల నుండి నెయ్యిని కొనుగోలు చేయండి. కొన్ని కంపెనీలు స్వచ్ఛమైన నెయ్యిని అందిస్తాయి. అటువంటి కంపెనీల నెయ్యిని కొనుక్కుంటే మంచిది.

Admin

Recent Posts