వినోదం

Anushka Shetty : ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో అనుష్క శెట్టి మిస్ చేసుకున్న సినిమాలు ఇవే..!

Anushka Shetty : టాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో ప‌వన్ క‌ళ్యాణ్‌, అనుష్క త‌ప్ప‌క ఉంటారు. అనుష్క శెట్టి బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన అనుష్క.. గత కొంతకాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరస ఆఫర్లు తలుపు తడుతున్నా ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే సంద‌డి చేస్తుంది. అయితే ఈ అమ్మ‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌చ్చినా కూడా మిస్ చేసుకుంది.

అగ్ర హీరోల అందరి సరసన ఆడిపాడిన అనుష్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే వీరిద్దరి కాంబోలో రెండు చిత్రాలు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల అవి మిస్ అయ్యాయి. ఆ చిత్రాలు ఏంట‌న్న‌ది చూస్తే… పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సుస్వాగతం ఒకటి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రమిది. పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించారు. ఇందులో అనుష్క‌ని ముందుగా క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. కానీ ఆమె ప‌లు కార‌ణాల వ‌ల‌న త‌ప్పుకుంది.

Anushka Shetty missed to do these films with pawan kalyan

ఇక భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ అన్నవరం అనే సినిమా చేశాడు. ఈ సినిమా సైతం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో కూడా మొదట పవన్ కు జోడీగా అనుష్కను తీసుకోవాలని అనుకున్నా కూడా ఎందుకో ఈ కాంబో కుద‌ర‌లేదు. ఆమె స్థానంలో ఆసిన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. మొత్తానికి ప‌వన్ స‌ర‌స‌న రెండు సార్లు ఛాన్స్ అందుకున్నా కూడా ఎందుకో వ‌దిలేసుకుంది. ఇక ప‌వన్ ప్ర‌స్తుతం సినిమాలు, రాజకీయాల‌తో బిజీగా ఉన్నారు. సినిమాలు కాస్త త‌గ్గించే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Admin

Recent Posts