food

Ragi Onion Chapati : రాగి పిండిలో ఉల్లిపాయ‌లు క‌లిపి.. చపాతీలు చేసి తింటే.. ఎంతో రుచి.. ఆరోగ్య‌క‌రం..

Ragi Onion Chapati : మన శరీరానికి రాగులు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి. కనుకనే రాగులను జావ రూపంలో చాలా మంది వేసవిలో తీసుకుంటుంటారు. అయితే వీటితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ కలిపి చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక రాగులు, ఉల్లిపాయలతో చపాతీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి – ఉల్లి చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..

రాగి పిండి – ఒక కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1, పెరుగు – రెండు టీస్పూన్లు, కొత్తిమీర – అర కప్పు, నూనె – తగినంత.

Ragi Onion Chapati make like this

రాగి – ఉల్లి చపాతీ తయారు చేసే విధానం..

వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. చపాతీలలా ఒత్తాలి. రాగి చపాతీ త్వరగా విరిగిపోతుంది. కనుక చేతికి నూనె రాసుకుని చేత్తోనే ఒత్తాలి. స్టవ్‌ మీద పెనం ఉంచి వేడెక్కాక కొద్దిగా నూనె వేయాలి. ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి జాగ్రత్తగా రెండు వైపులా కాల్చి తీసేయాలి. పెరుగు, టమాటా పచ్చడిలతో తింటే ఈ చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యాన్ని, పోషకాలను, శక్తిని అందిస్తాయి.

Admin

Recent Posts