వినోదం

Artist Ravi Prakash : క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవిప్రకాష్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

Artist Ravi Prakash : డాక్టర్ కాబోయే యాక్టర్లమయ్యామని సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు అంటుంటారు. ఈ కోవకు చెందిన సినీ ఆర్టిస్టులు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక అదే కోవకి చెందిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 200 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదటి సినిమా తనకు ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా రవిప్రకాష్ ఘర్షణ, అతడు, వేదం సినిమాల్లో పోషించిన పోలీసు ఆఫీసరు పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. తమిళంలో వానం, పయనం, మాట్రాన్ లాంటి సినిమాల్లో నటించాడు. అయితే ఒక ఇంటర్వ్యూ ద్వారా రవి ప్రకాష్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Artist Ravi Prakash interesting facts

నేను విశాఖలో పుట్టి పెరిగాను. లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని ఆయన తెలిపారు. విద్యాభ్యాసం అంతా విశాఖలోనే జరిగింది. విశాఖ వేలీ స్కూల్‌లో ఇంటర్మీడియట్ వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్‌ మాస్కోలో చేశానని రవి ప్రకాష్ తెలిపారు. కొంతకాలం పాటు హైదరాబాద్‌లో డాక్టర్ ప్రాక్టిస్‌ చేశాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు ప్రోత్సాహంతో అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశాను. 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యానని రవి ప్రకాష్ వెల్లడించారు. అయితే క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రంతో తనకు నటుడిగా మంచి పేరు తెచ్చిందని, అలా డాక్టర్ గా స్థిరపడాలనుకున్న నేను యాక్టర్ గా స్థిరపడ్డానని రవి ప్రకాష్ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

Admin

Recent Posts