Mutton Masala Chops : సండే అంటే, నాన్ వెజ్ ప్రియులు కచ్చితంగా నాన్వెజ్ వుండాలసిందే. ఈ సండే, కొంచెం వెరైటీగా ఉండడానికి, మటన్ మసాలా చాప్స్ ని మీకోసం తీసుకువచ్చాము. వీటిని మీరు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైగా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లోనే మటన్ మసాలా చాప్స్ ని, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. బయట కొనుక్కోక్కర్లేదు. ఈ మసాలా చాప్స్ ని తయారు చేయడానికి, మటన్ 750 గ్రాములు, ఉల్లిపాయలు రెండు, టమాటాలు రెండు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు తీసుకోవాలి. అలానే, కొంచెం నూనె కూడా తీసుకోండి.
ముందు మటన్ ని చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని, శుభ్రంగా క్లీన్ చేసుకుని, తర్వాత మిక్సీలో టమాట, ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం, జీలకర్ర, మిర్యాల పొడి వేసి బాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మటన్ చాప్స్ లో పసుపు వేసి కుక్కర్లో వేసి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత, కొత్తిమీర తరుగు వేసుకుని, రెండు నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు పాన్లో నూనె వేసి, నూనె వేడెక్కాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పెరుగు వేసి వదిలేయండి.
ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలాని, ధనియాల పొడి వేసి పది నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు ఉడికిన మటన్ లో రుచికి సరిపడా సాల్ట్ వేసి, తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి. స్టవ్ ఆపేసి మసాలా చాప్స్ ని సర్వ్ చేసుకోండి. ఇలా టేస్టీ టేస్టీగా మీరు మటన్ మసాలా చాప్స్ ని, ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది. కావాలంటే, ఈసారి ట్రై చేయండి. అస్సలు వదిలిపెట్టరు.