వినోదం

Venkatesh : వెంకటేష్ బావ అనేక చిత్రాల్లో విల‌న్‌గా చేశారు.. ఎవ‌రో తెలుసా..?

Venkatesh : సినిమా రంగంలో చాలా మంది ప‌నిచేస్తుంటారు. అనేక మంది తెర వెనుక ఉండి ప‌నిచేస్తే.. న‌టీన‌టులు మాత్రం తెర ముందు ఉంటారు. ఇక ఇప్ప‌టికే మ‌నం అనేక మందిని తెర‌పై చూశాం. అయితే సినిమా రంగంలోకి ఎవరు ఎప్పుడు ఏ విధంగా అడుగుపెడతారో మనం ఊహించలేము. ఇందులో ఎవరు హిట్ అయి ఈ రంగంలో కొనసాగుతారో, ఎవరు బయటకు వెళ్లి పోతారో ఊహించడం చాలా కష్టం. సినిమాల‌లో మనం ఎన్నో రకాల పాత్రలు చూస్తూ ఉంటాం. హీరో, హీరోయిన్లు, విలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది చాలా రకాలుగా ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు.

ఆయా పాత్రల‌లో కొంతమంది మాత్రమే వాటికి న్యాయం చేయగలరని రుజువైంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న నటుడు ఈ కోవకు చెందినవాడే. తాను మొదట్లో డిస్ట్రిబ్యూటర్.. ఆ తర్వాత సొంతంగా నిర్మాణాలు సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. సినిమాలో విలన్ అనగానే భారీ ఆకారం భయంకరంగా కనిపించే విధంగా కండలు తిరిగిన ఒళ్ళు అని అనుకుంటే మాత్రం పొరపాటే.

ashok kumar acted in many movies

కానీ ఆయన్ను చూస్తే అసలు సినిమాల్లోకి ఏ విధంగా వచ్చాడని అనిపిస్తుంది. ఈయన ప్రేక్షకులని భయపెట్టింది కేవలం ఆయన కళ్ళు, జుట్టుతోనే. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.. మనందరికీ బాగా తెలిసిన అశోక్ కుమార్. ప్రొడ్యూసర్ గా సొంత సినిమాలు నిర్మిస్తున్న రోజుల్లో అనుకోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ పాత్రలో సినీరంగ ప్రవేశం చేశారు ఆయన. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్‌ సినిమాలో విలన్ పాత్ర తో ఎంట్రీ ఇచ్చారు. ఏ మాత్రం నటనపై అవగాహన లేకున్నా, కొల్లా అశోక్ కుమార్ సొంతంగా చెవిలో పువ్వు అనే సినిమాను నిర్మించారు. ఈ సమయంలో కొత్తవాళ్లలో టాలెంట్ గుర్తించి చూపించే డైరెక్టర్ కోడి రామకృష్ణ.. సెట్ లో కనిపించిన అశోక్ కుమార్ ని చూసి నా చిత్రంలోనూ నటించాలని అడిగారు. దానికి అశోక్ కుమార్ నేను నటించడం ఏమిటి అసలు నటనే నాకు తెలియదు అన్నాడు.

నువ్వు ఏంటో నాకు తెలుసు, నీకు ఏ పాత్రలు ఇవ్వాలో నాకు తెలుసు మిగతాదంతా నాకు వదిలేయనున్నారు కోడి రామకృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన భారత్ బంద్ సినిమాలో విలన్ పాత్రలో తెరంగేట్రం చేయించారు. దీని తర్వాత ఆయనకు ఒసేయ్ రాములమ్మ సినిమా చాలా పేరు తెచ్చింది. దీని తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. ఇక‌ ఆయన ప్రొడ్యూసర్ గా చేయడానికి ప్రధాన కారణం ఆయన మేనమామ రామానాయుడు. అంటే స్టార్ హీరో అయిన‌ వెంకటేష్ కి ఈయన బావ అవుతారు. ఇంతటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆయన ఎప్పుడూ వాళ్ల పేర్లు వాడుకోలేదు.

Admin

Recent Posts