Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా.. బాక్సాఫీస్ వద్ధ ఘన విజయం సాధించి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అయితే ఈ మూవీ కొంత స్లో గా సాగుతుందనే అంశం ఒక్కటే దీనికి మైనస్ గా ఉంది. అందువల్లే కొంత వరకు ఈ మూవీకి నెగెటివ్ టాక్ కూడా వస్తోంది. అయితే చివరి నిమిషంలో రాధే శ్యామ్ సినిమా నుంచి పలు సీన్లను తొలగించారు. కారణాలు తెలియదు కానీ.. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆ సీన్లను మళ్లీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
రాధేశ్యామ్లో రిద్ధి అనే ఆర్చర్ కేవలం ఒకే చేత్తో ఆర్చరీని ప్రాక్టీస్ చేస్తుంటుంది. అసలు సినిమాలో రిద్ధి కుమార్ సీన్లు ఎక్కువగానే ఉంటాయి. కానీ థియేటర్లో రిలీజ్ అయిన వెర్షన్ లో మాత్రం ప్రభాస్ ఆమె గురించి కేవలం న్యూస్ పేపర్లోనే వార్త చదువుతాడు. ఇలా చాలా సీన్లకు కోత వేశారు. దీంతో అసలు సినిమా నుంచి తొలగించిన అన్ని సీన్లను మళ్లీ కలపాలని.. దీంతో సినిమాకు కొత్త లుక్ వస్తుందని.. ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
మరి మేకర్స్ సీన్లను యాడ్ చేస్తారా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది. అయితే వారాంతంలో ఈ మూవీ బాగానే కలెక్షన్లను సాధించింది. కానీ సోమవారం నుంచి కలెక్షన్లు ఎలా ఉంటాయి.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.