food

Baingan Pulao : వంకాయ‌ల‌తో క‌మ్మ‌ని పులావ్‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Baingan Pulao : వంకాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వంకాయ ట‌మాటా, వంకాయ కుర్మా, ప‌చ్చ‌డి, పెరుగు ప‌చ్చ‌డి.. ఇలా ర‌క ర‌కాల వంట‌కాల‌ను మ‌నం వంకాయ‌ల‌తో చేయ‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో చేసే ఈ కూర అయినా లేదా ప‌చ్చ‌డి అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే వంకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే బైంగ‌న్ పులావ్‌ను కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని కొన్ని నిమిషాల్లోనే వండ‌వ‌చ్చు. పెద్ద‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. చాలా త్వ‌ర‌గా రెడీ అవుతుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. ఇక బైంగ‌న్ పులావ్‌ను ఎలా చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బైంగ‌న్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తి బియ్యం – 2 క‌ప్పులు (అర గంట ముందు నాన‌బెట్టుకోవాలి), వంకాయ‌లు – 10, దాల్చిన చెక్క – చిన్న ముక్క‌, యాల‌కులు – 4, అనాస పువ్వు – 1, ల‌వంగాలు – 4, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌, నూనె – పావు క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ‌లు – 2, బిర్యానీ ఆకు – 1, ట‌మాటాలు – 2, ప‌సుపు – అర టీస్పూన్‌, ధ‌నియాల పొడి – ఒక టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – 1 టీస్పూన్‌, బిర్యానీ మ‌సాలా – 1 టీస్పూన్‌, కారం – 1 పెద్ద టీస్పూన్‌, పెరుగు – అర క‌ప్పు.

baingan pulao recipe in telugu make like this

మ‌సాలా కోసం..

వేయించిన ప‌ల్లీలు – పావు క‌ప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, వెల్లుల్లి రెబ్బలు – 5, ప‌సుపు – అర టీస్పూన్‌, కారం – 1 టీస్పూన్‌, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌.

బైంగ‌న్ పులావ్‌ను త‌యారు చేసే విధానం..

మ‌సాలా కోసం పెట్టుకున్న ప‌దార్థాలు, త‌గినంత ఉప్పు మిక్సీలో వేసుకుని మెత్త‌గా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని గాట్లు పెట్టుకున్న వంకాయ‌ల్లో కూరాలి. స్ట‌వ్ మీద కుక్క‌ర్‌ని పెట్టి నెయ్యి, నూనె వేయాలి. నెయ్యి క‌రిగాక దాల్చిన చెక్క‌, యాల‌కులు, ల‌వంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేయించుకుని ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా ముక్క‌లు, పెరుగు, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, బిర్యానీ మ‌సాలా, కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. అన్నీ ఉడికాక వంకాయ‌లు, క‌డిగిన బియ్యం, మూడున్న‌ర క‌ప్పుల నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి బైంగ‌న్ పులావ్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా కూర‌, రైతాతోనూ లాగించేయ‌వ‌చ్చు. ఎంతో ఇష్టంగా తింటారు.

Admin

Recent Posts